గెబార్హ వేదికగా సౌతాఫ్రికాపై జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. బ్యాటింగ్ బాగా ఆడినా.. బౌలర్లు విఫలమవడంతో ఈ మ్యాచ్ లో భారత్ కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో గెలిచింది సఫారీలే అయినా భారత బ్యాటర్ రింకూ సింగ్ కొట్టిన సిక్సర్ హైలెట్ గా నిలిచింది. ఇదేదో సాధారణ సిక్స్ అనుకుంటే పొరపాటే. రింకూ పవర్ ధాటికి ఏకంగా మీడియా గ్లాస్ సైతం పగిలిపోవడం విశేషం.
సౌతాఫ్రికా కెప్టెన్ మాక్రమ్ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్కరం ఈ ఓవర్ లో తొలి నాలుగు బంతులకు నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఈ ఓవర్ చివరి రెండు 2 బంతులను సిక్సర్లుగా కొట్టడంతో మొత్తం ఈ ఓవర్ లో 16 పరుగులు వచ్చాయి. రింకూ కొట్టిన ఈ రెండు సిక్సులు భారీగా వెళ్లాయి. ఈ క్రమంలోనే రింకూ సింగ్ కొట్టిన సిక్సర్ దెబ్బకు మీడియా బాక్స్ గ్లాస్ బద్దలైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19.3 ఓవర్లలో 7 వికెట్లను 180 పరుగులు చేసింది. రింకూ సింగ్ (39 బాల్స్‌లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 నాటౌట్), సూర్యకుమార్ (36 బాల్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), తిలక్ వర్మ (29) రాణించారు. మ్యాచ్ మధ్యలో వర్షం రావడంతో సౌతాఫ్రికా టార్గెట్‌ను 15 ఓవర్లలో 152 రన్స్‌గా రివైజ్ చేశారు. లక్ష్య ఛేదనలో దీన్ని సఫారీలు 13.5 ఓవర్లలో 154/5 స్కోరు చేసి నెగ్గారు. రీజా హెండ్రిక్స్ (27 బాల్స్ 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 49), కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (30) మెరుపులు మెరిపించారు.
Rinku Singh has broken the glass of media box with a six. ?
— Johns. (@CricCrazyJohns) December 12, 2023
- The future is here. pic.twitter.com/4hKhhfjnOr