Rinku Singh: ఎంపీతో భారత క్రికెటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం.. ఎవరీమె..?

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. రింకూ సింగ్ ఉత్తర ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు ప్రియా సరోజ్‌ను ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు సమాచారం. ప్రియా సరోజ్ ఇటీవల మచ్లిషహర్ సెగ్మెంట్ నుంచి 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే పెళ్లి తేదీని ఇంకా వెల్లడించలేదు. రింకూ- ప్రియాల ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సహచర క్రికెటర్లు, అభిమానులు రింకూస్ యంగ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రింకూ చెల్లెలు నేహా సింగ్‌ తన అన్నతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేయడం.. ఇందులో బంధువుల సందడి.. ఇల్లంతా అలంకరించినట్లుగా కనిపించినట్టుగా ఉండడంతో వీరి  ‍ నిశ్చితార్థం జరిగినట్లు నెటిజన్లు అంచనాకు వస్తున్నారు. ప్రస్తుతం రింకూ సింగ్ జనవరి 22 నుంచి ఇంగ్లాండ్  తో జరగబోయే టీ20 ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. 

ALSO READ | National Sports Awards: ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న గుకేష్, మను భాకర్

ప్రియా సరోజ్ తల్లి తుఫానీ సరోజ్. ఆమె సమాజ్ వాదీ పార్టీ మూడు సార్లు  ఎంపీగా ఎన్నికయ్యారు. 2024లో ప్రియా సరోజ్ తన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బిపి సరోజ్‌ని 35,850 ఓట్ల తేడాతో ఓడించి, పార్లమెంటు దిగువ సభకు ఎన్నికైన రెండవ అతి పిన్న వయస్కురాలు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి బిఎ డిగ్రీతప్ పాటు నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుండి LLB పట్టా పొందారు.