IND vs ZIM 2024: రింకూ సింగ్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో స్పెషల్ అవార్డు

జింబాబ్వేతో ఆదివారం (జూలై 14) ముగిసిన 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ను భారత యువ క్రికెట్ జట్టు 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. గిల్ సారధ్యంలోని భారత యువ జట్టు తొలి మ్యాచ్ లో ఓడిపోయినా.. ఆ తర్వాత వరుసగా నాలుగు టీ20 మ్యాచ్ ల్లో సునాయాసంగా విజయం సాధించారు. బ్యాటింగ్, బౌలింగ్ విషయాన్ని పక్కన పెడితే ఈ సిరీస్ లో టీమిండియా బెస్ట్ ఫీల్డర్ గా రింకూ సింగ్ నిలిచాడు. 

ఫీల్డింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన రింకు సింగ్‌కు "ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్" మెడల్ లభించింది. భారత్ సిరీస్ విజయం సాధించిన తర్వాత ఈ యువ ప్లేయర్ కు స్టాండ్-ఇన్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ మెడల్ అందించారు. ఈ అవార్డు తర్వాత ఈ సిరీస్‌కు భారత ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించిన  శుభదీప్ ఘోష్ రింకూ సింగ్ పై ప్రశంసలు కురిపించాడు. వరల్డ్ కప్ లో ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైన రింకూ.. జింబాబ్వే సిరీస్ లో బ్యాటింగ్ లో తన మార్క్ చూపించి ఆకట్టుకున్నాడు.  

ALSO READ | Rohit Sharma: అలాంటి ఆలోచన లేదు.. రిటైర్మెంట్ వార్తలను కొట్టిపారేసిన రోహిత్ శర్మ

ఆదివారం (జూలై 14) జింబాబ్వేతో జరిగిన చివరిదైన టీ20 మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 42 రన్స్ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. దాంతో ఐదు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌ను 4–1తో సొంతం చేసుకుంది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి తొలుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 167/6 స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటై ఓడింది. శివం దూబేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌, వాషింగ్టన్ సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కాయి.