Kids : అల్లరి చేస్తున్న పిల్లలను.. ఇలా దారిలోకి తెద్దాం..!

Kids : అల్లరి చేస్తున్న పిల్లలను.. ఇలా దారిలోకి తెద్దాం..!

పదేళ్ల వయస్సులో  బుద్దిగా చదువుకోవాలి. తోటి పిల్లలతో స్నేహంగా ఉండాలి. తల్లిదండ్రుల మాట  తప్పకుండా పాటించాలి.  ఇలా ఉండాల్సిన వారు  ప్రస్తుత కాలంలో  రూడ్​గా బిహేవ్ చేస్తున్నారు .  కొంతమంది చదువులో కూడా వెనకపడడుతున్నారు.. ఈ సమస్య ఒక్క పిల్లాడిదే కాదు..  చాలామంది పిల్లలది కూడా...  స్కూల్ డేస్​ లో  బుద్ధిగా ఉండే పిల్లలు.., కాస్తా యంగేజ్​కు  వచ్చేసరికి మారిపోతారు. తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్తారు. అవసరమైతే అబద్దాలు చెప్తారు. ఇలాంటి సీన్లు ప్రతి ఇంట్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే తల్లిదండ్రులు వీటిని పట్టించుకోకపోతే పిల్లలు దారితప్పుతారు. అలాగని కఠినంగా ఉంటే అసలుకే ఎసరొస్తుంది. పిల్లలు నొచ్చుకోకుండా.. మనసు మార్చేందుకు ప్రయత్నం చేయాలి.

పెరిగి పెద్దవుతుంటే పిల్లల ఆలోచనల్లో  కూడా మార్పు వస్తుంది. అయితే పిల్లల మనస్తత్వం మారుతోందన్న విషయం గమనించక చాలామంది తల్లిదండ్రులు భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటారు. ముఖ్యంగా కొందరి పిల్లలో ప్రవర్తన ఊహించని విధంగా మారిపోతుంది. అప్పటి వరకు ఇంట్లో సరదాగా ఉంటూ, ఇంటి పనుల్లో సహకరిస్తూ సర్దుకుపో తూ ఉండేవాళ్లు కాస్తా అన్నింటికీ విసుక్కుంటారు. వాదన చేయడం మొదలు పెడతారు. ఏ పని చెప్పినా వినిపించుకోరు... పైగా అరుస్తారు. ... గొడవ పెట్టుకుంటారు. ఇలాంటప్పుడే పేరెంట్స్ ఆందోళన చెందకుండా.. పిల్లల్ని మార్చే ప్రయత్నం చేయాలి.

Also Read:-ఈ మెషిన్ వాడితే ఎప్పటికీ టీనేజ్ లాగే ఉంటారు..

ఆలోచనల్లో మార్పు

హెయిర్ స్టయిల్ నుంచి చేసుకునే బట్టలు దాకా అన్నీ తమకు వచ్చినట్లు ఉండాలనుకుంటారు. అవి ఇంట్లో పెద్దోళ్లకు నచ్చవు. పది పన్నెందేళ్ల వయసంటే బాల్యానికి దూరమవుతూ, టీనేజ్ లోకి అడుగుపెడుతున్న స్టేజ్ శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఒక్కోసారి పెద్దవారిలా వాదనలు పెట్టుకునే ఈ పిల్లలే మరోసారి చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటారు. వీరి ఇష్టాలను కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఈ విషయాలు తెలియక చాలామంది పేరెంట్స్ భయపడతారు.

కొన్ని కండీషన్స్

ఎదురుతిరగటం, తమ ఇష్టాలకు ప్రయారిటీ ఇవ్వడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా పిల్లల ఎదుగుదలలో భాగంగా చూడాలి. అయితే పిల్లలకు ఫ్రీడం ఇస్తూనే కండీషన్స్ కూడా పెట్టాలి. లేకపోతే దారి తప్పే అవకాశాలు ఉంటాయి. నీ ఇష్టం వచ్చినట్లు కానీ హద్దులు దాటొద్దు అనే విషయం వాళ్లకు అర్థమయ్యేలా సున్నితంగా, స్పష్టంగా చెప్పాలి. దాంతో వాళ్లకు కొంతవరకు ఫ్రీడం దొరికినట్లు ఫీలవుతారు.   పిల్లలకి తమ అభిప్రా యాలను చెప్పే అవకాశం ఇవ్వాలి. ఆ తరవాత వారి అభిప్రాయం తప్పనిపిస్తే ఆలోచించు అని మాత్రమే చెప్పాలి.  ఇలా చేస్తే పిల్లలు ఏ  విషయమైనా చర్చించడానికి ఇష్టపడతారు.

అతిగా చెప్పకూడదు

ఎదిగే వయసులో పిల్లలు మనను కొత్త స్నేహాల వైపు దారి మళ్లుతుంది. ఇంటి దగ్గర లేని స్వేచ్ఛ ను బయట పొందాలనుకుంటారు. అలాంటి ఆలోచనలు రాకుండా పేరెంట్స్ జాగ్రత్త పడాలి . పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛనివ్వడం, ఎక్కువ కండీషన్స్ పెట్టడం రెండూ మంచిది కాదు. ఈ రెండూ పిల్లలపై ప్రభావం చూపుతాయి. వాళ్లతో సరదాగా మాట్లాడుతూ ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి..

సర్దిచెప్పాలి

కాస్త వయసొచ్చాక  పిల్లలతో తల్లిదండ్రులు స్నేహితుల్లా నడుచుకోవాలి. పిల్లల ఫ్రెండ్స్ తోనూ మాట్లాడాలి. దాంతో పిల్లలు ఎలాంటి వాళ్లతో ఫ్రెండ్​షిప్​  చేస్తున్నారో తెలిసిపోతుంది. చెడ్డ ఆలోచనలు ఉన్నవాళ్లు ఉంటే వాళ్లకు దూరంగా ఉండమని అర్థమయ్యేలా చెప్పాలి.

టాలెంట్ ను గుర్తించాలి.

మార్కులు, ర్యాంకుల విషయంలో పిల్లలను ఇతరులతో పోల్చడం మంచిదికాదు. ఇతరుల సక్సెస్​ ను  స్ఫూర్తినిచ్చేలా చెప్పడంలో తప్పులేదు. కానీ పిల్లలను ఇతరులతో పోల్చడం అసలు మంచిది కాదు. ఎదుటివారిని మెచ్చుకునే ముందు పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించాలి. పిల్లల ఆసక్తులను గుర్తించి ప్రోత్సహిస్తే వాళ్ల భవిష్యత్తు బాగుంటుంది

-వెలుగు, లైఫ్–