బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్‌కు ఆందోళనకారుల అల్టిమేటం.. గంటలో పదవి నుంచి దిగిపోండి

బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్‌కు ఆందోళనకారుల అల్టిమేటం.. గంటలో పదవి నుంచి దిగిపోండి

బంగ్లాదేశ్​లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి  స్టూడెంట్స్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్​ని టార్గెట్​ చేసుకున్నారు. ఆయన మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారుడని, గంటలో పదవికి రాజీనామా​చేయాలని డిమాండ్​ చేశారు. ఇతర న్యాయమూర్తులు కూడా పదవి నుంచి దిగిపోవాలని పట్టుబట్టారు. త‌‌ప్పుకోకుంటే వారి ఇండ్లపై దాడులు చేస్తామని హెచ్చరించారు. 

అపెక్స్​ కోర్టు వరకు భారీ ర్యాలీ తీశారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ ఒబైదుల్​ హసన్​ దిగొచ్చారు. తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఢాకా: బంగ్లాదేశ్​లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి న్యాయవ్యవస్థను పునరుద్ధరించాలంటూ అక్కడి స్టూడెంట్స్​శనివారం నిరసనకు దిగారు. సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకొని కదంతొక్కారు. ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారుడని విమర్శించారు. సీజేకు గంట సమయమిచ్చి పదవికి రాజీనామా​ చేయాలని డిమాండ్​ చేశారు. 

ఇతర న్యాయమూర్తులు కూడా పదవి నుంచి దిగిపోవాలని పట్టుబట్టారు. ఒక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేళ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్పుకోని ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షంలో.. వారి ఇండ్లపై దాడులు చేస్తామని విద్యార్థులు బెదిరించారు. యాంటీ డిస్క్రిమినేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ స్టూడెంట్ మూమెంట్ కు చెందిన కో ఆర్డినేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ హస్నత్​ అబ్దుల్లా ఈ అల్టిమేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ం జారీ చేశాడు. అపెక్స్​ కోర్టువరకు భారీ ర్యాలీ తీశారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​ ఒబైదుల్​ హసన్​ దిగివచ్చారు. తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఫుల్ కోర్టు సమావేశంపై రగడ

దేశంలో రిజర్వేషన్లపై నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం భారత్​లో ఆశ్రయం పొందుతున్నారు.  అయితే, శనివారం బంగ్లాదేశ్​ ప్రధాన న్యాయమూర్తి కొత్త ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఫుల్ కోర్టు సమావేశం నిర్వహించారు. ఈ విషయం ఆందోళనకారులకు తెలియడంతో మరోసారి రోడ్డెక్కారు. స్టూడెంట్స్​తోపాటు పలువురు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.

 దీంతో జడ్జిల సమావేశం అర్ధంతరంగా ముగించారు. అయినా.. ఆందోళనకారులు శాంతించలేదు. ప్రధాన న్యాయమూర్తి గంటలో పదవి నుంచి దిగిపోవాలని అల్టిమేటం జారీచేశారు. దీంతో చీఫ్​ జస్టిస్​ ఒబైదుల్​ హసన్ రాజీనామా చేసేందుకు అంగీకరించారు. కాగా, బంగ్లాదేశ్​లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జులైనుంచి జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకూ 560 మంది చనిపోయినట్టు శనివారం పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. షేక్​హసీనా రాజీనామా తర్వాత 232 మంది మరణించినట్టు తెలిపాయి. దీని వెనుక విదేశీ హస్తం ఉందంటూ కథనాలు వెలువడ్డాయి.

ఢాకాలో హిందువుల నిరసన

దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్ల లో తమ ఇండ్లు, ఆలయాలు, షాపుల ను టార్గెట్ చేసి ధ్వంసం చేస్తున్నారని హిందువులు  వాపోతున్నారు. దీనిని నిరసిస్తూ శనివారం ఢాకాలోని షాబాగ్ ఇంటర్ సెక్షన్​లో వేలాది మంది హిందువులు బైఠాయించారు. మైనారిటీ హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్​ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. 

మరోవైపు, ఈ విషయంపై వాషింగ్టన్​కు చెందిన ఓ ఎన్జీవో సభ్యులు శనివారం యునైటెడ్ నేషన్స్​ హెడ్డాఫీసు ముందు ఆందోళన చేశారు. హిందువులతో పాటు బంగ్లాదేశ్​లోని ఇతర మైనారిటీలకు రక్షణ కల్పించాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంలో అమెరికా ప్రత్యక్షంగా చొరవచూపాలని, ఇద్దరు ఇండో-అమెరికన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చట్టసభ సభ్యులు తానేదార్, ​కృష్ణమూర్తి కోరారు.