గుడ్ న్యూస్: ఇంటర్వ్యూతో ఫ్రొఫెసర్,ఫ్యాకల్టీ జాబ్స్

గుడ్ న్యూస్: ఇంటర్వ్యూతో ఫ్రొఫెసర్,ఫ్యాకల్టీ జాబ్స్

వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మిజోరంలోని రీజినల్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ పారా మెడికల్​ అండ్​ నర్సింగ్​ సైన్సెస్ అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్​ 7వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య 13: ఎంఎల్​టీ, ఆర్ఐటీ, ఆప్ట్రోమెట్రి విభాగాల్లో ప్రొఫెసర్, ఆర్ఐటీ, ఫిజియోథెరఫి, డియాటిటిక్స్ లో అసోసియేట్​ప్రొఫెసర్, సీనియర్ స్కేల్​ ఎంఎల్ టీ, సీనియర్ స్కేల్​ నర్సింగ్, ఫిజియోథెరపి, నర్సింగ్, డియోటిటిక్స్, ఎంఎల్ టీ, ఆప్టోమెట్రీలో అసిస్టెంట్​ పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్ డీ, మాస్టర్ డిగ్రీ, ఎంఎస్సీ నర్సింగ్, డీ–ఫార్మాసిలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి ప్రొఫెసర్ కు 50 ఏండ్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్ కు 40 ఏండ్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్ కు 35 ఏండ్లు మించకూడదు. 
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా. డైరెక్టర్, రిపాన్స్, జిమాబాక్, ఐజ్వాల్, మిజోరం చిరునామాకు అప్లికేషన్లను పంపించాలి.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంఏఎన్ఐటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు

ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి మౌలానా ఆజాద్​ నేషనల్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ(ఎంఏఎన్ఐటీ) అప్లికేషన్లు కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీలోగా ఆన్ లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య 22: అసిస్టెంట్​ప్రొఫెసర్ గ్రేడ్​–1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్​–2. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. 

లాస్ట్​ డేట్: ఏప్రిల్​ 16.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.