ఇప్పటివరకు 71వేల మంది ఎలక్షన్‌లో డబ్బులు పోగొట్టుకున్నారు.. ఎట్లంటే..!

కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పదవి ప్రధాన మంత్రిని ఎన్నికోవడానికి, పార్లమెంట్ వ్యవహారాలు నడవడానికి లోక్ సభ జనరల్ ఎలక్షన్ నిర్వహిస్తారు. ఇటీవల విడుదల చేసిన లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ 18వ ది. అంటే ఇండియాకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సార్లు లోక్ సభకు ఎలక్షన్స్ జరిగాయి. 1947లో తర్వాత ఫస్ట్ టైం 1951లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాల ప్రకారం... ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పోటీ చేసిన వారిలో మొత్తం 71వేల మంది అభ్యర్థులకు సెక్కూరిటీ డిపాజిట్ కోల్పోయారు.

 MPగా లోక్ సభకు పోటీ చేయాలనుకునే వారు కొంత డబ్బును డిపాజిట్ చేయాయి. అది ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకైనా రూ.12వేల 500, జనరల్ అభ్యర్థులకు 25వేలుగా ఉంది. ఆ వ్యక్తి పోటీచేసిన నియోజకర్గంలో విజేతకు పోలైయిన ఓట్లలో ఆరవ వంతు ఓట్లు వస్తే వారికి కట్టిన డిపాజిట్ ఎన్నికల కమిషన్ తిరిగి ఇచ్చేస్తోంది. ఆరోవంతు కూడా ఓట్లు పడని వారు డిపాజిట్ కోల్పోయినట్లుగా పరిగణిస్తారు. ఆ డబ్బును గవర్నమెంట్ ట్రెజరీకి పంపిస్తారు.

ALSO READ :- కుటుంబ సభ్యుల్ని చూసేందుకు కవితకు కోర్టు అనుమతి

డిపాజిట్ అమౌంట్ 1951లో జ‌న‌ర‌ల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీల‌కు రూ.250 లుగా ఉండేది. ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్ రూ.12,500 మరియు 25వేలకు పెంచారు. దేశ‌వ్యాప్తంగా తొలి లోక్‌స‌భ ఎన్నిక‌ల నుంచి ఇప్పటి వరకు 91,160 మంది ఎలక్షన్ లో  పోటీ చేశారు. దాంట్లో 71,246 మంది త‌మ సెక్యూర్టీ డిపాజిట్‌ను కోల్పోయారు. అది 78 శాతంగా ఉన్నట్లు ఈసీ వెల్లడించిన డేటా ద్వారా తెలుస్తోంది. 1951-52 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 40 శాతం మంది డిపాజిట్ కోల్పోయారు.  1996లో జ‌రిగిన 11వ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 13952 మంది  పోటీప‌డ‌గా, దాంట్లో 12,688 మందికి డిపాజిట్ రాలేదు. నేషనల్ పార్టీల అభ్యర్థులే ఎక్కువగా డిపాజిట్ దక్కించుకున్నారట.