కాన్పూర్ టెస్టులో విరాట్ కోహ్లీ ఔటయ్యే ప్రమాదం నుంచి బయట పడ్డాడు. గత టెస్టులో దురదృష్ట కర రీతిలో ఔటైన కోహ్లీని ఈ సారి అదృష్టం వరించింది. ఖలీద్ అహ్మద్ వేసిన ఓవర్ లో కోహ్లీ బంతిని టచ్ చేసి సింగిల్ కి కాల్ ఇచ్చాడు. పరుగు కోసం క్రీజ్ దాటాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో పంత్ క్రీజ్ సగానికి చేరుకున్నాడు. అయితే ఈ లోపు బౌలర్ ఖలీద్ వేగంగా ముందుకు రావడంతో కోహ్లీని పంత్ వెనక్కి వెళ్ళమని చెప్పాడు. ఈ లోపు ఖలీద్ ముందుకువచ్చి త్రో విసిరాడు.
ALSO READ | IND vs BAN 2nd Test: విరాట్‌దే వరల్డ్ రికార్డ్.. 27000 పరుగుల క్లబ్‌లో కోహ్లీ
ఈ దశలో కోహ్లీ ఔట్ అనుకుంటున్నా దశలో బంగ్లా బౌలర్ ఈజీ త్రో మిస్ చేశాడు. దగ్గరకు వెళ్లి కూడా వికెట్లను కొట్టడంలో విఫలమయ్యాడు. దీంతో విరాట్ ఊపిరి పీల్చుకున్నాడు. సునాయాస రనౌట్ మిస్ కావడంతో వికెట్ కీపర్ లిటన్ దాస్ తో పాటు బంగ్లా ప్లేయర్లు నిరాశకు గురయ్యారు. తన తప్పును గ్రహించిన పంత్.. కోహ్లీ దగ్గరకు వచ్చి గట్టిగా హద్దుకొని క్షమాపణలు తెలిపాడు. కోహ్లీ కూడా చిరు నవ్వు నవ్వడంతో టీమిండియా డగౌట్ సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
27 వేల పరుగుల క్లబ్ లో కోహ్లీ:
ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా 27000 పరుగులు సాధించిన రికార్డ్ ను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 25వ ఓవర్‌లో 35 పరుగుల వద్ద కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్ గా కోహ్లీ నిలిచాడు. ఓవరాల్ గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్ కోహ్లీ. సచిన్ టెండూల్కర్ తో పాటు కుమార సంగక్కర, రికీ పాంటింగ్‌లు ఈ జాబితాలో ఉన్నారు.టెస్టులో కోహ్లీ 35 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్సర్ తో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. మంచి టచ్ లో కనిపించిన విరాట్ వేగంగా ఆడే క్రమంలో షకీబ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.
The Moments Rishabh Pant hugged Virat Kohli and apologies him.
— Tanuj Singh (@ImTanujSingh) September 30, 2024
- This is beautiful Moments. ❤️pic.twitter.com/Qp49KnPeBU