దుబాయ్: ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఐసీసీ ‘మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ బ్యాట్స్‌మన్ పాల్ స్టిర్లింగ్ కూడా రేస్‌లో ఉన్నారు. ఐసీసీ ఈ అవార్డును కొత్తగా ప్రవేశపెడుతున్నది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో బెస్ట్ పెర్ఫామెన్స్ చూపెట్టిన మెన్స్, వుమెన్స్ క్రికెటర్లను గుర్తించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆసీస్‌పై మూడు టెస్ట్‌లు ఆడిన పంత్.. సిడ్నీ (97), బ్రిస్బేన్ (89)లో సత్తా చాటాడు. ఈ రెండు పెర్ఫామెన్స్‌ల వల్లే టీమిండియా సిరీస్ విక్టరీ సాధించింది. గత నెలలో రూట్.. శ్రీలంకపై 228, 186 రన్స్ సాధించాడు. మూడో నామినీగా ఉన్న స్టిర్లింగ్.. యూఏఈ, అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఐదు వన్డేల్లో మూడు సెంచరీలు చేశాడు. వుమెన్ క్రికెటర్స్‌లో డయానా బేగ్ (పాకిస్తాన్)తో పాటు సౌతాఫ్రికా ద్వయం షాబ్నిమ్ ఇస్మాయిల్, మరిజానే కాప్.. ఈ అవార్డు రేస్‌లో ఉన్నారు. ప్రతి నెల రెండో సోమవారం ఐసీసీ డిజిటల్ చానెల్స్ ద్వారా విన్నర్స్‌ను ప్రకటిస్తారు.
For More News..