Rishab Shetty, Vikram: బాక్సాఫిస్ బద్దలయ్యే అప్డేట్.. కాంతారా చాప్టర్ 1లో విక్రమ్!

అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచినా సినిమా కాంతారా(Kantara). కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఇక తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తమ సొంత సినిమాగా ఆదరించారు. నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

కాంతార: చాప్టర్ 1పేరుతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన అనౌన్సమెంట్ వీడియో ఆ అంచనాలని మరింత పెంచేసింది. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

తాజాగా హీరో రిషబ్ శెట్టి చియాన్ విక్రమ్ ను కలవడంతో ఇంట్రెస్టింగ్ టాక్ మొదలైంది. ప్రస్తుతం విక్రమ్ (Vikram) నటించిన తంగలాన్ మూవీ ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో రిషబ్ శెట్టి, విక్రమ్ కలిసి పలు సినిమా విశేషాలు పంచుకున్నారు. వీరిద్దరూ సెల్ఫీలు దిగిన ఫొటోస్ ను రిషబ్ ట్విట్టర్ X లో పోస్ట్ చేస్తూ.."నటుడిగా మారే నా ప్రయాణంలో విక్రమ్ సర్ ఎప్పుడూ నాకు స్ఫూర్తి. 24 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఈ రోజు నన్ను ప్రభావితం చేసిన వ్యక్తిని కలుసుకోవడం నన్ను భూమిపై అత్యంత అదృష్ట వ్యక్తిగా చేసింది. నాలాంటి నటీనటులను ప్రేరేపించినందుకు ధన్యవాదాలు మరియు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సర్" అంటూ మనసులో మాటను వెల్లడించారు. దీంతో ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

అయితే, వీరిద్దరూ తంగలాన్ రిలీజ్ సందర్బంగా కలిసినా కూడా కాంతారా చాప్టర్ 1 లో చియాన్ నటించే అవకాశాలు ఉన్నాయని టాక్ ఉంది. ఇప్పటికే ఏ సినిమాలో జూ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి కాంతారాలో ఎవరు భాగం కానున్నారో త్వరలో తెలిసే అవకాశం ఉంది. 

నిజంగా ఈ సినిమాకు గనక విక్రమ్ ఓకే చెప్తే..కాంతార సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. ఈ న్యూస్ తెలుసుకున్న విక్రమ్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. కాంతారా లాంటి గొప్ప సినిమాలో తమ హీరోకు స్థానం కలిపిస్తున్నదుకు రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.
 
 రిషబ్ శెట్టి..ఈ ప్రీక్వెల్ కోసం హై లెవెల్ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. కాంతారా కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి దాదాపు రూ.400 కోట్ల వరకు కల్లెక్షన్స్ సాధించి కన్నడ ఇండస్ట్రీలోనే బాక్సాపీస్ బాద్షా అనిపించుకుంది. కానీ, రిషబ్ శెట్టికి దక్కింది మాత్రం కేవలం రూ.4 కోట్లు మాత్రమే. దీంతో ఈ ‘కాంతార ప్రీక్వెల్’ కోసం రిషబ్ శెట్టి ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నాడని న్యూస్ వినిపిస్తోంది. అంటే అతని రెమ్యునరేషన్ 25 రెట్లు పెంచేసాడన్న మాట.

కాంతార చాప్టర్-1 ప్రీక్వెల్ కి కూడా హీరో రిషబ్ శెట్టినే కథను అందిస్తూ..దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీని హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.