చిన్న సినిమాగా వచ్చి ఎక్స్పెక్ట్ చేయని రీతిలో రికార్డు సృష్టించిన కాంతార సినిమాకు మరో ఘనత దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సొంతం చేసుకుంది. మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ కేటగిరీలో `కాంతార` ఫేమ్ రిషబ్ శెట్టిని ఈ పురస్కారం వరించింది. ముంబయిలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 2023 సంవత్సరానికి గానూ కాంతారకు ఈ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని నటుడు రిషబ్ శెట్టి ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఈ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నానన్న ఆయన.. తనను నమ్మి అవకాశం ఇచ్చిన హోంబాలే ఫిల్మ్స్ కు, విజయ్ కిరగందూర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తన భార్య ప్రగతి శెట్టికి, మద్దతు ఇచ్చిన కాంతారావు బృందానికి, సాంకేతిక నిపుణులకు రిషబ్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు. దాంతో పాటు ఈ అవార్డును తాము దైవంగా భావించే పవర్ స్టార్, లెజెండరీ భగవాన్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నానని పోస్ట్ లో రాసుకొచ్చారు.