ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి జై హనుమాన్ అనే టైటిల్ తో సీక్వెల్ కూడా ప్రకటించారు. ఈ సినిమాని తెలుగు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే కాంతార సినిమాలో తన హిలెరియస్ ఫెరఫార్మెన్స్ తో అదరగొట్టిన కన్నడ ప్రముఖ హీరో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు టాక్ బలంగా వినిపిస్తుంది. దీంతో జై హనుమాన్ అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఫ్యాన్స్ ఎంతగానో ఎదురచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. జై హనుమాన్ సినిమాలో హీరో రిశబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన అధికారిక సోషల్ మీడియాలో జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి కి పాత్రని రివిల్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశాడు.
ఈ పోస్టర్ లో రిషబ్ శెట్టి శ్రీరాముడి విగ్రహాన్ని ఎత్తుకుని కనిపించాడు. అలాగే జాతీయ అవార్డు పొందిన నటుడితో జతకట్టడం గౌరవంగా ఉంది. జై హనుమాన్ అనే పవిత్ర శ్లోకంతో ఈ దీపావళిని ప్రారంభించి, ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిద్దామని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ లో పేర్కొన్నాడు.
Also Read :- ప్రభాస్ ఆ స్టార్ హీరో మల్టీస్టారర్ సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేశాడా..?
ఈ విషయం ఇలా ఉండగా గతంలో హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మించారు. దీంతో రూ. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా రూ.350 కోట్లు కలెక్ట్ చేసింది. హనుమాన్ పెద్ద హిట్ అవ్యవడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రెమ్యూనరేషన్ పెంచేశాడట.
ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ సుముఖంగా లేకపోవడంతో జై హనుమాన్ ప్రాజెక్ట్ టాలీవుడ్ లోని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత చేతికి వెళ్ళిందని మరికొందరు అంటున్నారు.