
న్యూఢిల్లీ: కారు యాక్సిడెంట్‌లో తీవ్ర గాయాల నుంచి కోలుకున్న ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇస్తున్న రిషబ్ పంత్ ఈ సీజన్‌లో తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. 2022 డిసెంబర్‌లో ప్రమాదానికి గురైన పంత్ గత సీజన్‌కు దూరమయ్యాడు. అతని ప్లేస్‌లో డేవిడ్ వార్నర్ ఢిల్లీని నడిపించాడు. అయితే, 14 నెలల్లోనే పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడంతో పంత్ రీఎంట్రీకి ఎన్‌సీఏ, బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దాంతో పంత్‌ను తిరిగి కెప్టెన్‌గా నియమించినట్లు ఢిల్లీ ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 23న తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ.. పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది.