Rishabh Pant: రిషబ్ పంత్ గొప్ప మనసు.. వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు

Rishabh Pant: రిషబ్ పంత్ గొప్ప మనసు.. వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు

భారత వికెట్ కీపర్/ బ్యాటర్ రిషబ్ పంత్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో కొత్త ఛారిటీ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించిన రిషబ్.. ఇకపై తనకొచ్చే ఆదాయంలో10 శాతం ఫౌండేషన్‌కు ఇస్తానని తెలిపాడు. ఈ మేరకు ఎక్స్(X) వేదికగా వీడియో పోస్ట్ చేశాడు. అందులో తన ఉద్దేశ్యాన్ని వివరించాడు.

ALSO READ | Aimee Maguire: ఇల్లీగల్ బౌలింగ్ యాక్షన్.. మహిళా క్రికెటర్‪పై సస్పెన్షన్ వేటు

క్రికెట్ తనకు ఎంతో ఇచ్చిందని.. అందువల్ల ఇకపై వాణిజ్య సంపాదనలో 10 శాతం రిషబ్ పంత్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు పంత్ తెలిపాడు. 

"క్రికెట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. నా దగ్గర ఉన్నదంతా క్రికెట్ వల్ల సంపాదించినదే. అందుకు నేను కృతజ్ఞుడను. ఆలస్యంగానైనా నాకింత ఇచ్చిన సమాజానికి నేనేమివ్వగలనని ఆలోచించాను. అందుకు మంచి సమయం ఇదే. ప్రకటనల వల్ల వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నా. క్రికెట్ వల్ల నేను ఎలాగైతే సంతోషంగా చిరునవ్వుతో ఉండగలుగుతున్నానో.. ప్రజల ముఖాలపై అటువంటి చిరునవ్వు చూడాలన్నదే నా లక్ష్యం.." అని పంత్ వీడియోలో తెలిపాడు.

ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాడు

2017లో అంతర్జాతీయ అరంగేట్రం పంత్ అంచెలంచెలుగా ఎదుగుతూ భారత జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో కలిపి 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతని కోసం ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించింది.