లక్నో కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా పంత్‌‌‌‌‌‌‌‌

లక్నో కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా పంత్‌‌‌‌‌‌‌‌

కోల్‌‌‌‌‌‌‌‌కతా : టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా నియమితుడయ్యాడు. ఈ సీజన్ వేలంలో పంత్‌‌‌‌‌‌‌‌ను రికార్డు స్థాయిలో రూ. 27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన లక్నో ఊహించినట్టుగానే అతనికే కెప్టెన్సీ అప్పగించింది. సోమవారం కోల్‌‌‌‌‌‌‌‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆ టీమ్ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంజీవ్‌‌‌‌‌‌‌‌ గోయెంకా, జహీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌, పంత్ సమక్షంలో అధికారిక ప్రకటన చేసింది.  

2016లో ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ జట్టుతో ఉన్న పంత్‌‌‌‌‌‌‌‌ 2021 నుంచి టీమ్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా కొనసాగాడు. మరోవైపు గత మూడు సీజన్ల పాటు లక్నోకు కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించాడు. కానీ,  ఈ సీజన్ వేలానికి ముందు లక్నో అతడిని వదులుకుంది. ఇప్పుడు రాహుల్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టనున్న పంత్‌‌‌‌‌‌‌‌ జట్టు కోసం 200 శాతం కష్టపడతానని చెప్పాడు. తనపై నమ్మకం ఉంచి ఈ  బాధ్యత అప్పగించిన ఎల్‌‌‌‌‌‌‌‌ఎస్జీకి థ్యాంక్స్ చెప్పాడు.