రిషబ్ పంత్ ఎలా ఉన్నాడు..? తిరిగి జట్టులో ఎప్పుడు చేరతాడు? అని ఆలోచిస్తున్న భారత అభిమానులకు ఆనందాన్ని పంచే వార్త ఒకటి అందుతోంది. పంత్ మైదానంలోకి అడుగుపెట్టేసి..ధనాధన్ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. అంతేకాదు అతను అతి త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అందుకు ముహూర్తం కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున పంత్ JSW ఫౌండేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ తన మాటలతో ప్రజల్లో స్ఫూర్తినింపే ప్రయతం చేసిన అతను.. కాసేపటి అనంతరం మైదానంలోకి అడుగుటపెట్టాడు. అలా బరిలోకి దిగిన పంత్ మునుపటిలా వేగంగా కదలటమే కాదు.. అలవోకగా సిక్సులు బాదేశాడు. ఫ్రంట్ ఫుట్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా పంత్ కొట్టిన సిక్స్ చూసి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియో చూశాక పంత్ రీ ఎంట్రీకి ఎక్కువ సమయం పట్టదని చెప్పకనే చెప్పొచ్చు.
Rishabh Pant has resumed batting practice.
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2023
An excellent news for Indian cricket! pic.twitter.com/5I2Q6tsaeE
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ నాటికి..
గాయాల నుంచి దాదాపుగా కోలుకున్న పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్ సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. అతను కోలుకుంటున్న తీరు చూస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సర్కిల్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత పర్యటనకు రానుంది. జనవరిలో ఈ సిరీస్ జరగనుండగా.. అప్పటివరకూ పంత్ ఫిట్‌నెస్ సాధిస్తాడని, సెలక్షన్ అందుబాటులో ఉంటాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ తెలిపింది.