DC vs LSG: కెప్టెన్సీ ఫ్లాప్.. చెత్త బ్యాటింగ్: లక్నోని చేజేతులా ఓడించిన రూ.27 కోట్ల వీరుడు

DC vs LSG: కెప్టెన్సీ ఫ్లాప్.. చెత్త బ్యాటింగ్:  లక్నోని చేజేతులా ఓడించిన రూ.27 కోట్ల వీరుడు

వైజాగ్ వేదికగా సోమవారం (మార్చి 24) జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ పై  ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. చివరి వరకు హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో ఢిల్లీ సంచలన విజయాన్ని అందుకుంది. 210 పరుగుల లక్ష్య చేదనలో 7 పరుగులకే 3 వికెట్లు పడినా.. 65 పరుగులకే సగం జట్టు పెవిలియన్ కు చేరినా.. అశుతోష్ శర్మ(66, 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ తో లక్నోపై ఢిల్లీ ఓడిపోయే మ్యాచ్ లో గెలిచింది.

గెలవాల్సిన మ్యాచ్ లక్నో చేజేతులా పోగొట్టుకోవడానికి కెప్టెన్ రిషబ్ పంత్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట బ్యాటింగ్ లో 6 బంతుల్లో డకౌట్ అయిన పంత్.. ఆ తర్వాత వికెట్ కీపింగ్.. కెప్టెన్సీలో దారుణంగా నిరాశపరిచాడు. ఒక్క స్టార్ ఫాస్ట్ బౌలర్ లేకుండానే.. అనుభవం లేని బౌలర్లకు తుది జట్టులో స్థానం కల్పించాడు. ఈ విషయం పక్కనపెడితే చివరి ఓవర్ లో శార్దూల్ ఠాకూర్ లాంటి అనుభవం ఉన్న పేసర్ కు ఓవర్ ఇవ్వకుండా స్పిన్నర్ షాబాజ్ కు బంతి అందించాడు. దీంతో చివరి ఓవర్లో లక్నో ఓడిపోయింది.

ALSO READ | GT vs PBKS: పంజాబ్‌తో గుజరాత్ మ్యాచ్.. మిడిల్ ఆర్డర్‌లో బట్లర్.. ఓపెనర్‌గా శ్రేయాస్

ఇక ఒక వికెట్ తీస్తే చాలు మ్యాచ్ గెలుస్తాం అనుకునే దశలో చివరి ఓవర్ లో ఈజీ స్టంపింగ్ మిస్ చేశాడు. మోహిత్ శర్మను స్టంపింగ్ చేసి ఉంటే లక్నో గెలిచేది. దీంతో పాటు అంతకముందు ఒక రనౌట్ ను పంత్ చేయడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్ మెగా ఆక్షన్ లో పోటీ పడీ మరీ లక్నో సూపర్ జయింట్స్ రూ.27 కోట్ల రూపాయలకు పంత్ ను దక్కించుకుంటే.. తొలి మ్యాచ్ లోనే ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచాడు. పంత్ కారణంగానే లక్నో ఓడిపోయిందని ఆ జట్టు అభిమానులు తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే  మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లను 211 పరుగులు చేసి గెలిచింది. అశుతోష్ శర్మ(66, 31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అసాధారణ ఇన్నింగ్స్ తో పాటు విప్రజ్ నిగమ్ పవర్ హిట్టింగ్ తో 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి లక్నోని వణికించాడు.