LSG vs DC: రూ.27 కోట్లు దండగే: బ్యాటింగ్ చేయడానికి భయపడుతున్న పంత్.. ఏడో స్థానంలో వచ్చి డకౌట్

LSG vs DC: రూ.27 కోట్లు దండగే: బ్యాటింగ్ చేయడానికి భయపడుతున్న పంత్.. ఏడో స్థానంలో వచ్చి డకౌట్

మంగళవారం (ఏప్రిల్ 22) ఏకనా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రావడానికి సందేహిస్తున్నాడు. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించాల్సిన పంత్.. బ్యాటింగ్ లో తప్పించుకొని సహచర ప్లేయర్లపై భారం వేస్తున్నాడు. నాలుగు వికెట్లు పడినా బ్యాటింగ్ కు దిగకపోవడం ఆశ్యర్యానికి గురి చేస్తుంది. పంత్ తీవ్ర ఒత్తిడిలో ఉన్న కారణంగానే బ్యాటింగ్ కు దిగడానికి భయపడుతున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

డగౌట్ లో ప్యాడ్ లు కట్టుకొని నిలుచున్నా వికెట్ పడుతుంటే తాను రాకుండా వేరే బ్యాటర్ ను పంపిస్తున్నాడు. నాలుగో స్థానంలో సమద్.. ఐదో స్థానంలో మిల్లర్ వచ్చారు. కనీసం ఆరో స్థానంలో అయినా వస్తాడనుకుంటే బదోనిని పంపించాడు. బదోనీ ఔటైన తర్వాత చివరి ఓవర్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. రెండు బంతులాడి డకౌటయ్యాడు. సహజంగా పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. కానీ జట్టుకు మంచి శుభారంభాలు వస్తే అబ్దుల్ సమద్ కు నాలుగో స్థానంలో ఛాన్స్ ఇస్తున్నాడు.

Also Read : బ్యాటింగ్‌లో లక్నో ఫ్లాప్ షో.. ఢిల్లీ ముందు ఈజీ టార్గెట్!

ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ. 27 కోట్ల రికార్డ్ ధరకు లక్నో తీసుకుంటే ఘోరంగా బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. చూస్తుంటే పంత్ తన మీద తనకు కాన్ఫిడెంట్ పోయిందేమో అనే అనుమానం కలగక మానదు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న పంత్ ఇకనైనా గాడిలో పడకపోతే విమర్శలు మూటగట్టుకోవాల్సిందే. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మార్కరం (33 బంతుల్లో 52:2 ఫోర్లు, 3 సిక్సర్లు), మార్ష్ (45) ఇచ్చిన సూపర్ స్టార్ట్ ను వినియోగించుకోలేక లక్నో సూపర్ జయింట్స్ ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగుల స్కోర్ మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్, చమీరాలకు తలో వికెట్ దక్కింది.