బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా( Urvashi Rautela) తాజా పోస్ట్ ఒకటి నెటిజన్లలో చర్చకు దారితీసింది. బ్యాటింగ్ గ్లౌజులు వేసుకుని వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియోను ఆమె షేర్ చేసింది. దీనికి కొత్త ఆరంభం..కొత్త సినిమా అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇందులో మాట్లాడుకోవడానికి ఏం లేకపోయినా కొందరు ఈ వీడియోతో క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant)పై ట్రోలింగ్కి దిగారు. ఆమె బ్యాటింగ్ గ్లౌజులతోనే..క్రికెట్ ఆడుతోంది..చాలా ధైర్యం ఎక్కువని ఓ నెటిజన్ ట్రోల్ చేశాడు. అలాగే ఆమె వికెట్ కీపింగ్ చూసి పంత్కి లైటర్ వర్షన్లా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఈ క్రికెటర్‌కి సంబంధం లేకపోయినా కామెంట్స్ సెక్షన్స్‌లో అతడిపై విమర్శలు చేస్తున్నారు.
రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు సంవత్సరం నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఊర్వశి రౌతేలా, రిషబ్ పంత్ మధ్య వివాదం జరిగింది.
వారిద్దరి మధ్య సోషల్ మీడియా వార్ కూడా భారీగానే సాగింది. ఇక ఊర్వశితో పంత్ రిలేషన్‌పై కొంతకాలంగా కాంట్రవర్సీ అవుతున్న విషయం తెలిసిందే.అలాగే వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని గొడవల కారణంగా విడిపోయారనే రూమర్ కూడా బయటకు వచ్చింది.
ALSO READ :- ఛత్తీస్‌గఢ్లో బీజేపీ మేనిఫెస్టో.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్స్ ఎవ్వరు లేకుండా పోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకు స్పెషల్ సాంగ్స్ అంటే ఊర్వశి రౌతేలా అనేంతగా..తెలుగులో ఆమె వరుస సినిమాల్లో చేస్తుంది. ఎనర్జిటిక్ రామ్ స్కందలో, చిరంజీవి వాల్తేరు వీరయ్య, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో, అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది.