
ఐపీఎల్ లో లక్నో సూపర్ జయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్ లో రెండో సారి స్లో ఓవర్ రేట్ కు గురయ్యాడు. ఆదివారం (ఏప్రిల్ 27) ముంబై ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ కు రూ.24 లక్షల రూపాయల ఫైన్ వేశారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో రెండో సారి స్లో ఓవర్ రేట్ ఎదుర్కొన్న కెప్టెన్ గా నిలిచాడు. టాస్ గెలిచి లక్నో ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో ముంబై మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ముంబై ఇన్నింగ్స్ దాదాపు రెండు గంటల పాటు జరిగింది. ఫీల్డింగ్ లో మార్పులు చేయడానికి పంత్ ఎక్కువగా సమయం తీసుకున్నాడు.
రెండో సారి స్లో ఓవర్ రేట్ కావడంతో ఈ సారి కెప్టెన్ తో పాటు లక్నో జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు కూడా ఫైన్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ తో సహా జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు టోర్నమెంట్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% ఏది తక్కువైతే అది జరిమానా విధించబడుతుంది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా శిక్ష అనుభవించిన కెప్టెన్ల లిస్ట్ లో పంత్ తో పాటు శుభ్‌మాన్ గిల్ (గుజరాత్), అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్), సంజు సామ్సన్ (రాజస్థాన్ రాయల్స్), రజత్ పాటిదార్ ( రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్ ), హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్) ఉన్నారు.
ఈ సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లకు జరిమానా విధించబడదు. అయితే కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు. ఇవి మూడు సంవత్సరాల పాటు కొనసాగుతాయి. ఈ నిషేధం తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో పంత్ కెప్టెన్సీలోనూ బ్యాటింగ్ లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. మొదట కెప్టెన్ గా విఫలమైన పంత్.. ఆ తర్వాత బ్యాటింగ్ లో కేవలం 4 పరుగులే చేసి ఔటయ్యాడు. పంత్ నిర్లక్ష్యపు షాట్ కారణంగా లక్నో ఓటమి దిశగా పయనించింది. మ్యాచ్ తర్వాత ఈ లక్నో కెప్టెన్ పై విమర్శలు వస్తున్నాయి.
ఆదివారం (ఏప్రిల్ 27) వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ పై ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో రికెల్ టన్ (32 బంతుల్లో 58: 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (28 బంతుల్లో 54:4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో పాటు బౌలింగ్ లో బుమ్రా విజృంభించి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో161 పరుగులకు ఆలౌటైంది.
ప్రస్తుతం లక్నో సూపర్ జయింట్స్ ఈ సీజన్ లో 10 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోవడం ఆ జట్టును తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది. మూడు మ్యాచ్ లు గెలిస్తే రేస్ లో ఉంటుంది. లక్నో తమ తదుపరి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ (మే 4), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (మే 9), గుజరాత్ టైటాన్స్ (మే 14) జట్లతో తలపడనుంది.
ICYMI, Rishabh Pant has been fined ₹25 lakh. The rest of the Playing XI, including the Impact Player, will be fined ₹6 lakh or 25% of their match fee, whichever is lower. pic.twitter.com/V0xT1ZpzEf
— CricTracker (@Cricketracker) April 28, 2025