చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో పర్వాలేదనిపించాడు. 52 బంతుల్లో 39 పరుగులు చేసి హసన్ మహమ్మద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 632 రోజుల తర్వాత మళ్లీ టెస్ట్‌ల్లోకి అడుగుపెట్టిన పంత్ కు తొలి మ్యాచ్ లోనే చేదు అనుభవం ఎదురైంది. భారత ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ తో వాగ్వాదం జరిగింది.
తస్కిన్ అహ్మద్ వేసిన 16 ఓవర్ రెండో బంతికి ఓవర్‌త్రోలో పంత్ సింగిల్ తీశాడు. ఓవర్‌త్రోలో ఈ బంతి పంత్ శరీరానికి తగలడంతో అతను లిటన్ దాస్ పై అసహనానికి గురయ్యాడు. బంతిని నాకు ఎందుకు కొడుతున్నారు. అతనికి విసరండి అని కోపంగా అన్నాడు. దీనికి స్పందించిన బంగ్లా వికెట్ కీపర్ నాకు ఎక్కడ వికెట్లు కనిపిస్తే అక్కడ బంతిని విసురుతాను అని బదులిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. వీరి మధ్య సాగిన వాగ్వాదం కెమెరాలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. లోయర్ ఆర్డర్ సహాయంతో డీసెంట్ టోటల్ చేసేలా కనిపిస్తుంది. స్టార్ బ్యాటర్లు విఫలమైనా.. ఓపెనర్ జైశ్వాల్ 56 పరుగులు చేసి బాధ్యతాయుత బ్యాటింగ్ చేశాడు. 39 పరుగులు చేసి పంత్ అతనికి చక్కని సహకారం అందించాడు. లోయర్ ఆర్డర్ లో అశ్విన్, జడేజా భారీ భాగస్వామ్యంతో ప్రస్తుతం టీమిండియా 63 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. క్రీజ్ లో అశ్విన్ (64), జడేజా (43) ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు.
Argument between liton das & rishabh pant.
— PantMP4. (@indianspirit070) September 19, 2024
Rishabh : "usko feko na bhai mujhe kyu mar rhe ho" pic.twitter.com/cozpFJmnX3