ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ మైలురాయిని అందుకున్నాడు. భారత జట్టు తరపున వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC)లో వంద ఔట్లు చేసిన కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచిన స్టార్క్ క్యాచ్‌ను అందుకోవడం ద్వారా పంత్ ఈ ఘనత సాధించాడు.
భారత జట్టు తరఫున పంత్ 30 డబ్ల్యూటీసీ మ్యాచ్‌ల్లో 87 క్యాచ్‌లు, 17 స్టంపింగ్‌లను పూర్తి చేశాడు. ఈ జాబితాలో అత్యధిక ఔట్లు చేసిన రికార్డు ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ పేరిట ఉంది. క్యారీ 33 డబ్ల్యూటీసీ మ్యాచ్‌ల్లో 137 మందిని పెవిలియన్ పంపాడు.
డబ్ల్యూటీసీలో అత్యధిక మందిని పెవిలియన్ పంపిన కీపర్లు
- అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా): 137 (125 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లు)
- జాషువా డిసిల్వా (వెస్టిండీస్): 108 (103 క్యాచ్‌లు, 5 స్టంపింగ్‌లు)
- రిషబ్ పంత్ (భారత్): 100 (87 క్యాచ్‌లు, 13 స్టంపింగ్‌లు)
- టామ్ బ్లండెల్ (న్యూజిలాండ్): 90 (78 క్యాచ్‌లు, 12 స్టంపింగ్‌లు)
- మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్): 87 (80 క్యాచ్‌లు, 7 స్టంపింగ్‌లు)
2018లో భారత జట్టు తరపున టెస్టు అరంగేట్రం చేసిన పంత్.. టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC)లో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన ఆటగాడిగా రికార్డు కలిగివున్నాడు.
ALSO READ | IND vs AUS: దమ్ముంటే కొట్టు.. ఆసీస్ ఆటగాడికి జైశ్వాల్ ఛాలెంజ్