Rishabh Pant: ఆ జట్టు కొంటుందని భయపడ్డా.. ధోనీ సలహా మర్చిపోలేను: రిషబ్ పంత్

Rishabh Pant: ఆ జట్టు కొంటుందని భయపడ్డా.. ధోనీ సలహా మర్చిపోలేను: రిషబ్ పంత్

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా ఈ విషయాన్ని సోమవారం (జనవరి 20) అధికారికంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా పంత్ విలేఖరుల సమావేశంలో మాట్లాడాడు. "నేను నా జట్టు కోసం  200 శాతం పని చేస్తాను. గొప్ప ఫలితాలు అందించడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తాను. కెప్టెన్సీ చేపట్టడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. జట్టును నడిపించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను". అని పంత్ అన్నాడు. ఇక ఇదే మీటింగ్ లో తన మనసులోని మాటలను పంచుకున్నాడు. 

ఆక్షన్ జరిగే సమయంలో నాకు ఒకే ఒక టెన్షన్ ఉందని.. పంజాబ్ కింగ్స్ తనను కొంటుందని భయపడ్డానని పంత్ చెప్పుకొచ్చాడు. అయితే పంత్ ఈ మాటలను సరదాగా అన్నట్టు అర్ధమవుతుంది. నిజానికి  మెగా ఆక్షన్ ముందు అందరికంటే ఎక్కువగా పంజాబ్ కింగ్స్ వద్దే ఎక్కువ డబ్బు ఉంది. పంత్ కోసం పంజాబ్ భారీ మొత్తం వెచ్చించడానికి సిద్ధమైంది. అయితే పట్టు వదలకుండా లక్నో ఫ్రాంచైజీ పంత్ ను రూ. 27 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

ALSO READ | Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫితో వాంఖడేలో అడుగుపెడతాం: రోహిత్ శర్మ

ధోనీ తనకు ఇచ్చిన సలహా చాలా విలువైనదని పంత్ అభిప్రాయపడ్డాడు. ప్రాసెస్ మీద ఫోకస్ చెయ్. ఫలితం అనుకున్న విధంగా వస్తుంది. అని ధోనీ తనకు చెప్పిన సలహా ఎప్పటికీ తన మైండ్ లో ఉంటదని పంత్ తెలిపాడు. 2016 నుండి ఢిల్లీతో కొనసాగిన పంత్.. తొలిసారి లక్నో జట్టుతో చేరనున్నాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ కెరీర్‌లో 111 మ్యాచులు ఆడిన పంత్.. 3,284 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు

బ్యాటర్స్: ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బడోని (రిటైన్), హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్కే.

వికెట్ కీపర్లు: రిషబ్ పంత్, నికోలస్ పూరన్ (రిటైన్), ఆర్యన్ జుయల్.

ఆల్ రౌండర్లు: అబ్దుల్ సమద్ (స్పిన్), మిచెల్ మార్ష్ (పేస్), షాబాజ్ అహ్మద్ (స్పిన్), యువరాజ్ చౌదరి (స్పిన్), రాజవర్ధన్ హంగర్గేకర్ (పేస్), అర్షిన్ కులకర్ణి (పేస్).

స్పిన్నర్లు: రవి బిష్ణోయ్ (రిటైన్), ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ సింగ్.

ఫాస్ట్ బౌలర్లు: మయాంక్ యాదవ్ (రిటైన్), మొహ్సిన్ ఖాన్ (రిటైన్), ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, ఆకాష్ సింగ్, షమర్ జోసెఫ్, ప్రిన్స్ యాదవ్.