IND vs ENG: నా ఆట అంతే అంటే కుదరదు.. ఇకనైనా పంత్ మారాలి: సురేష్ రైనా

IND vs ENG: నా ఆట అంతే అంటే కుదరదు.. ఇకనైనా పంత్ మారాలి: సురేష్ రైనా

రిషబ్ పంత్.. ఆధునిక క్రికెట్‌లో అత్యంత విలువైన ఆటగాడు. క్రీజులో నిల్చుంటే ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందించగల సమర్ధుడు. మరి క్రీజులో కుదురుగా నిల్చుంటాడా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే.. ఈ యువ వికెట్‌కీపర్‌‌కు డిఫెన్స్ ఆడడామన్నా.. క్రీజులో గంటపాటు నిలబడటమన్నా పరమ అసహ్యం. అందుకే అడ్డగోలు షాట్లు ఆడి ఔటయ్యాక.. డగౌట్‌కు పోయి నిరుత్సాహ పడుతుంటాడు. ఇకనైనా ఈ ఆట మార్చుకోవాలని భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అతనికి సూచించారు.

జరిగిపోయిన కాలం ఎలాగూ ముందుకు రాదు.. కనీసం ఇకనైనా బాధ్యతగా ఆడటం అలవర్చుకోవాలని రైనా.. పంత్‌కు దిశానిర్ధేశం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ అందుకు మంచి అవకాశమని.. దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలని అతనికి సూచించారు. బాధ్యతగా బ్యాటింగ్ చేస్తేనే జట్టములో ఏక్కువ కాలం కొనసాగగలడని హెచ్చరించారు. 

"పంత్ వికెట్ కీపింగ్‌లో చాలా మెరుగుపడ్డాడు. ఇది సంతోషించదగ్గ విషయం. కాకపోతే అతడు బ్యాటింగ్ మరింత బాధ్యతతో ఆడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆడబోయే టోర్నీ 50 ఓవర్ల టోర్నమెంట్. కనీసం 40 నుంచి 50 డెలివరీలు ఎదుర్కోగలిగేలా ఉండాలి. యశస్వి టాప్ ఆర్డర్‌లో ఆడకపోతే రిషబ్ పంత్ జట్టులో కీలకం. నాల్గవ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం రావచ్చు. ఎందుకంటే అతడు గేమ్ త్వరగా ముగించగల ఆటగాడు. నేను యాభై డెలివరీలు ఆడితే 80 నుంచి100 పరుగులు చేయగలనని అతను తనకు తానుగా చెప్పుకోవాలి. ఆ ప్రతిభ, ఆ సామర్థ్యం అతనిలో ఉన్నాయి.." అని రైనా  స్టార్ స్పోర్ట్స్‌లో అన్నారు.

Also Read : మిథాలీ రాజ్ రికార్డ్ బ్రేక్ చేసిన మాథ్యూస్

జనవరి 22 నుంచి టీ20 సిరీస్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జనవరి 22 నుంచి ఐదు మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇది ముగిశాక మూడు వన్డేల సిరీస్ షురూ కానుంది. ఆ తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ.

 భారత్ vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్

  • జనవరి 22: తొలి టీ20 (కోల్ కతా)
  • జనవరి 25: రెండో టీ20 (చెన్నై)
  • జనవరి 28: మూడో టీ20 (రాజ్ కోట్)
  • జనవరి 31: నాలుగో టీ20 (పుణె)
  • ఫిబ్రవరి 2: ఐదో టీ20 (ముంబై)

వన్డే సిరీస్ షెడ్యూల్

  • ఫిబ్రవరి 6: తొలి వన్డే (నాగ్ పూర్)
  • ఫిబ్రవరి 9: రెండో వన్డే (కటక్)
  • ఫిబ్రవరి 12: మూడో వన్డే (అహ్మదాబాద్)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ షమీ, జస్ప్రిత్ షమీ, జస్ప్రిత్ షమీ బుమ్రా (ఫిట్‌నెస్‌కు లోబడి), అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్.
  
ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కులదీప్ షమీ, జస్ప్రిత్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్.

ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ , వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్).