లారస్ అవార్డ్స్‌‌‌‌‌‌‌‌ రేసు: ‘కమ్‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ విభాగంలో అవార్డుకు నామినేట్ అయిన పంత్..

లారస్ అవార్డ్స్‌‌‌‌‌‌‌‌ రేసు: ‘కమ్‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ విభాగంలో అవార్డుకు నామినేట్ అయిన పంత్..

న్యూఢిల్లీ: టీమిండియా డ్యాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్‌‌‌‌‌‌‌‌ 2025 రేసులో నిలిచాడు. కారు ప్రమాదం నుంచి బయటపడి మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన పంత్ ‘కమ్‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్’ విభాగంలో అవార్డుకు  నామినేట్ అయ్యాడు. ఈ పురస్కారాల ప్రదానోత్సవం ఏప్రిల్ 21న మాడ్రిడ్‌‌‌‌‌‌‌‌లో జరగనుంది. పంత్ 2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు.

కుడి కాలుకు పలు శస్త్ర చికిత్సలు జరిగాయి. అయినా పట్టుదల కోల్పోకుండా కోలుకున్న పంత్  గతేడాది ఐపీఎల్‌‌‌‌‌‌‌‌తో తిరిగి రీఎంట్రీ ఇచ్చాడు.  ప్రమాదం తర్వాత ఆడిన మొదటి టెస్టు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై  సెంచరీతో అదరగొట్టాడు.