టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఉత్తరఖండ్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తోన్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రూర్కీ సమీపంలో హమందాపూర్ ఝల్ ప్రాంతంలో పంత్ ప్రయాణిస్తోన్న బీఏండబ్ల్యూ కారు అదుపుతప్పి వేగంగా రేయిలింగ్‌ను తగిలింది. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన అనంతరం స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించడంతో తృటిలో ప్రాణాలతో పంత్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
అప్పటివరకు అద్భుతమైన ఫామ్ లో ఉన్న పంత్.. అకస్మాత్తుగా యాక్సిడెంట్ కావడంతో ఈ స్టార్ బ్యాటర్ ఈ ఏడాది బ్యాట్ పట్టనే లేదు. ఈ క్రమంలో ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ తో పాటు స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీ కూడా మిస్ అయ్యాడు. భారత జట్టులో వేగంగా చేరాలనే పంత్ సంకల్పానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. వేగంగా కోలుకున్న పంత్.. ఐపీఎల్ లో రీ ఎంట్రీ లో అదరగొట్టాడు. కెప్టెన్ గా బ్యాటర్ గా సత్తా చాటి టీ20 వరల్డ్ కప్ కు సెలక్టయ్యాడు. ధావన్ షో లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ తన ప్రమాదం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
"గాయం నుంచి కోలుకోవడానికి ఆత్మవిశ్వాసం, నమ్మకం చాలా ముఖ్యం. నా చుట్టూ ఉన్నవాళ్లంతా నేను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడమే చాలా పెద్ద విషయం అన్నారు. క్రికెట్ గురించి ఇక మరిచిపోవాల్సిందేనని చెప్పారు. ఆ క్షణంలో నేను బతుకుతానని కూడా నాకు అనిపించలేదు. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. రెండు నెలల పాటు కనీసం బ్రష్ కూడా చేయలేదు. ఆరేడు నెలల వరకూ తీవ్రమైన నొప్పితో ఏడ్చేవాడిని.
బయటికి వెళ్లాలంటే భయమేసేది. వీల్ ఛైయిర్‌లో జనాలను కలవాలంటే ఏదోలా అనిపించేది. రీఎంట్రీ కావడంతో నాపైన తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం చాలా ఆతృతగా ఉంది. ఇది నాకు మరో జన్మ.. కాబట్టి ఈసారి నేను ఏం సాధించినా నా వరకూ అది చాలా పెద్ద సక్సెస్ కిందే లెక్క" అంటూ పంత్ చెప్పుకొచ్చాడు.
Rishabh Pant opens up about his challenging recovery journey on Shikhar Dhawan's talk show Dhawan Karenge pic.twitter.com/t79YdstjoQ
— CricTracker (@Cricketracker) May 28, 2024