
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. ప్రాక్టీస్ సెషన్‌లో హార్దిక్ పాండ్యా కొట్టిన బాల్ తగిలి గాయపడ్డ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కోలుకున్నాడు. సోమవారం జరిగిన సెషన్‌లో అతను ప్రాక్టీస్ చేశాడు. ఐసీసీ అకాడమీలో రెండో రోజూ టీమిండియా నెట్ సెషన్‌లో పాల్గొనగా.. పంత్ దెబ్బ తగిలిన ఎడమ మోకాలికి ఎలాంటి కట్టు లేకుండా గ్రౌండ్‌లోకి వచ్చాడు. ముందుగా ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్స్, సెల్ఫీలు ఇచ్చిన రిషబ్ ప్రాక్టీస్ సెషన్‌ను జాగ్రత్తగా ప్రారంభించాడు.
మిగతా ప్లేయర్లు హై క్యాచ్‌లు అందుకోవడం ప్రాక్టీస్ చేయగా పంత్ ఫీల్డింగ్ డ్రిల్స్‌కు దూరంగా ఉన్నాడు. కాసేపు షాడో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. తర్వాత ఎడమ మోకాలికి బ్యాండేజీ వేసుకొని నెట్స్‌లోకి వెళ్లాడు. మరో వైపు ఇతర ఆటగాళ్లు రెండో రోజు కూడా ముమ్మర సాధన చేశారు. గురువారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో ఇండియా ఈ నెల 20న తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది.