IND vs NZ 3rd Test: ఆఖరి టెస్టుకు పంత్‌ దూరం?

IND vs NZ 3rd Test: ఆఖరి టెస్టుకు పంత్‌ దూరం?

ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడి సిరీస్ చేజార్చుకున్న టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగులుతోంది. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతోన్న వికెట్‌కీపర్‌/ బ్యాటర్‌ రిషబ్ పంత్ ఆఖరి టెస్టుకు దూరం కానున్నాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్‌ జురెల్‌ కీపింగ్ బాధ్యతలు చేపట్టవచ్చని జాతీయ మీడియా పేర్కొంది.  

బెంగళూరు టెస్టులో గాయపడిన పంత్ మూడో రోజు మైదానంలోకి రాలేదు. మోకాలి గాయం కారణంగా అసౌకర్యంగా కనిపించాడు. దాంతో, అతని స్థానంలో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ కీపింగ్ చేపట్టాడు. మరుసటి రోజే అతను ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ, అతనికి విశ్రాంతినిచ్చే యోచన టీమ్ మేనేజ్మెంట్ చేస్తోందట. రాబోవు ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో ఉంచుకొని అతనికి రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించిందని సమాచారం. 

ALSO READ | Sanju Samson: సంజు శాంసన్‌కు నేను పెద్ద అభిమానిని: భారత మాజీ స్టార్ క్రికెటర్

ఒకవేళ పంత్ దూరమైతే, భారత తది జట్టులో.. బ్యాటింగ్ ఆర్డర్‌లో పలు మార్పులు జరగవచ్చు. రోహిత్, జైస్వాల్, గిల్ తొలి మూడు స్థానాలకు పరిమితం కాగా.. నాలుగో స్తానంలో సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ చేయనున్నాడని కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పరిమితం కానున్నాడు.

బుమ్రాకు రెస్ట్...!

పంత్‌తోపాటు ప్రధాన పేసర్‌ బుమ్రాకు విశ్రాంతినివ్వడంపై మేనేజ్మెంట్ చర్చిస్తోందట. ఎలాగూ, సిరీస్ చేజారింది కనుక బెంచ్‌ను పరీక్షించనుందని సమాచారం. ఇక వాంఖడే పిచ్ స్పిన్‌కు అనుకూలం కావడంతో స్పిన్‌ త్రయం సుందర్, అశ్విన్, జడేజాలు జట్టులో కొనసాగనున్నారు.

మూడో టెస్టుకు భారత జట్టు(అంచనా): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.