న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌కు 16 మందితో కూడిన ఇండియా టీమ్‌ను ఆదివారం ప్రకటించారు. కారు యాక్సిడెంట్ కారణంగా 20 నెలల పాటు టెస్ట్‌లకు దూరమైన రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీతో పాటు బ్రేక్‌లో ఉన్న పేసర్ బుమ్రా టీమ్‌లోకి వచ్చేశారు. దులీప్ ట్రోఫీలో 9 వికెట్లు తీసిన ఆకాదీప్, యష్ దయాల్‌కు తొలిసారి టెస్ట్ టీమ్‌లో చోటు దక్కింది.
గాయం నుంచి కోలుకుంటున్న మహ్మద్ షమీకి చోటు కల్పించలేదు. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. రెండో కీపర్‌గా ధ్రువ్ జురెల్‌కు చాన్స్ ఇచ్చారు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 19 నుంచి చెన్నైలో తొలి మ్యాచ్, సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు కాన్పూర్‌లో రెండో టెస్ట్ జరగనుంది. జట్టు: రోహిత్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, తసిరాజ్, ఆకాశ్‌దీప్, బుమ్రా, యష్ దయాల్.