IND vs BAN 2024: రీ ఎంట్రీ అదుర్స్.. సెంచరీతో అదరగొట్టిన పంత్

IND vs BAN 2024: రీ ఎంట్రీ అదుర్స్.. సెంచరీతో అదరగొట్టిన పంత్

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ యువ వికెట్ కీపర్.. రీ ఎంట్రీలో తన తొలి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీతో సత్తా చాటాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో 124 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆటలో భాగంగా లంచ్ తర్వాత పంత్ ఈ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. పంత్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు.. 4 సిక్సర్లున్నాయి. టెస్ట్ కెరీర్ లో ఇది రిషబ్ కు ఇది ఆరో సెంచరీ.

తొలి ఇన్నింగ్స్ లో 39 పరుగులు చేసి  పర్వాలేదనిపించిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఏకంగా సెంచరీ బాదేశాడు. 20 నెలల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతున్నా తన పాత  ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. పంత్ తో పాటు గిల్ (87) హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఆధిక్యం 452 పరుగులకు చేరింది. మరో ఎండ్ లో గిల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. 

Also Read:-పంత్, గిల్ మెరుపులు.. చెన్నై టెస్టులో పట్టు బిగించిన భారత్