Rishabh Pant: పంత్‌కు వైరల్ ఫీవర్.. హై టెంపరేచర్: భారత వైస్ కెప్టెన్

Rishabh Pant: పంత్‌కు వైరల్ ఫీవర్.. హై టెంపరేచర్: భారత వైస్ కెప్టెన్

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత అభిమానులకు బ్యాడ్‌న్యూస్ అందుతోంది. టీమిండియా యువ వికెట్ కీపర్/ బ్యాటర్ రిషబ్ పంత్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ధ్రువీకరించాడు.

వైరల్ ఫీవర్ కారణంగా పంత్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదని, టెంపరేచర్ సైతం ఎక్కువగానే ఉందని గిల్ పేర్కొన్నాడు. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతనికి చికిత్స, అవసరమైన మందులు ఇస్తున్నారని తెలిపాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందుజరిగిన విలేకరుల సమావేశంలో గిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

తుది జట్టులో రాహులే.. 

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు పంత్ అందుబాటులో లేకపోయినా, అది భారత్‌పై పెద్దగా ప్రభావం చూపబోదు. ఎందుకంటే.. భారత జట్టులో వికెట్ కీపర్/ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ మొదటి ఎంపికగా కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో  రాహుల్ 47 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. గిల్‌తో కలిసి ఐదవ వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అటువంటి రాహుల్‌ను తప్పించి పంత్‌కు అవకాశమివ్వడమనేది అసంభవమే.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత జట్టు(అంచనా): 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా.