బెంగళూరు టెస్టులో టీమిండియా జోరుకు బ్రేక్ లు పడ్డాయి. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో దుమ్ములేపిన టీమిండియా స్వల్ప వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పంత్ 99 పరుగుల వద్ద ఔటై తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కివీస్ బౌలర్లు పుంజుకోవడంతో నాలుగో రోజు టీ విరామానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది. క్రీజ్ లో జడేజా(4), అశ్విన్(0) ఉన్నారు.
ప్రస్తుతం రోహిత్ సేన 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో నాలుగు వికెట్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో జడేజా, అశ్విన్ ఎంత వరకు బ్యాటింగ్ చేస్తారేనే విషయంపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మూడు వికెట్ల నష్టానికి 231 పరుగుల వద్ద ఓవర్ నైట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మొదటి సెషన్ లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడింది. కివీస్ బౌలర్లకు పంత్, సర్ఫరాజ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా ఆడారు. మూడో వికెట్ కు ఈ జోడీ 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది.
ALSO READ : Border-Gavaskar Trophy: భారత్‌తో టెస్ట్ సిరీస్.. దేశవాళీ క్రికెట్ బాట పట్టిన స్టార్క్, స్మిత్
150 పరుగుల మార్క్ అందుకున్న సర్ఫరాజ్ ను సౌథీ పెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత విలియం ఒరోర్కే చెలరేగడంతో పంత్ రాహుల్(12) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీంతో 3 వికెట్లను 408 పరుగులతో ఉన్న భారత్ ఒక్కసారిగా 6 వికెట్లకు 438 పరుగుల వద్ద నిలిచి కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ బౌలర్లలో విలియం ఒరోర్కే, అజాజ్ పటేల్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సౌథీ, ఫిలిప్స్ లకు తలో వికెట్ దక్కింది.
India lost three wickets for just 30 runs before the tea break and have an 82-run lead with four wickets in hand.
— CricTracker (@Cricketracker) October 19, 2024
New Zealand bowlers shone with the second new ball.
📸: Jio Cinema pic.twitter.com/5QzuUYg8cB