బెంగళూరు టెస్టులో టీమిండియా కష్టాలు కొనసాగుతున్నాయి. మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా భారత జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. మొదట బ్యాటింగ్ లో 46 పరుగులకే ఘోరంగా విఫలలైన మన జట్టు.. ఆ తర్వాత బౌలింగ్ లోనూ తడబడుతున్నారు. బౌలర్లు వికెట్లు కోసం శ్రమిస్తుంటే ఇదే సమయంలో రిషబ్ పంత్ కు గాయమైంది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్ చివరి బంతిని ఆఫ్ సైడ్ దిశగా వేశాడు. ఈ బంతిని డ్రైవ్ చేయాలని భావించిన కాన్వే విఫలమయ్యాడు.
బంతి మిస్ అయ్యి జడేజా మోకాలికి బలంగా తాకింది. దీంతో పంత్ అక్కడకక్కడే పడిపోయాడు. ఫిజియో చికిత్స చేసి పంత్ ను మైదానం నుంచి తీసుకెళ్లారు. నొప్పి భరించలేక మైదానం వీడడంతో భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. పంత్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం అనుమానంగా మారింది. కేఎల్ రాహుల్ ఉన్నప్పటికీ అతని స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయడానికి వచ్చాడు. అంతకముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్లిప్ లో రెండు క్యాచ్ లు మిస్ చేశాడు.
ALSO READ| IND Vs NZ, 1st Test: కుప్పకూలిన టీమిండియా.. వసీం జాఫర్ సెటైరికల్ వీడియో
ఫీల్డింగ్ బాగా చేసే హిట్ మ్యాన్ రెండు క్యాచ్ లు జారవిడవడం షాకింగ్ కు గురి చేస్తుంది. రెండు కూడా వరుస ఓవర్లో కావడం బాధాకరం. వీటిలో ఒకటి విల్ యంగ్ ది కాగా.. మరొకటి కాన్వేది. అయితే ఆ తర్వాత కాన్వేను అశ్విన్ బౌల్డ్ చేయగా.. యంగ్ వికెట్ జడేజా తీసుకున్నాడు. రెండో రోజు చివరి సెషన్ ఆడుతున్న న్యూజిలాండ్ ప్రస్తుతం 44 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి 121 పరుగుల ఆధిక్యం లభించింది. క్రీజ్ లో రచీన్ రవీంద్ర (19), మిచెల్(4) ఉన్నారు.