
రెండు రోజుల్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా సిద్ధమవవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రాక్టీస్ లో తీవ్ర కసరత్తులు చేస్తుంది. 2013 తర్వాత మరోసారి ఈ మెగా టైటిల్ ను దక్కించుకోవాలని గట్టి ప్రతయత్నాలు చేస్తుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా అనుభవమున్న ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభమవుతుంది . ఫిబ్రవరి 20 న బంగ్లాదేశ్ తో భారత్ తొలి లీగ్ మ్యాచ్ తో టోర్నీ ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియాకు ఒక బ్యాడ్ న్యూస్. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డాడు.
ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పంత్ మోకాలికి గాయం అయింది. దీంతో భారత జట్టు తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఆదివారం జరిగిన ఈ ప్రాక్టీస్ సెషన్ లో హార్దిక్ పాండ్యా కొట్టిన ఒక షాట్ పంత్ మోకాలికి బలంగా తగిలినట్టు సమాచారం. బంతి తగలగానే ఈ వికెట్ కీపర్ నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియోథెరపిస్టుల సహాయంతో పంత్ ఇబ్బంది పడుతూనే డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నాడు. సొంత సమయం తర్వాత పంత్ అసౌకర్యంగా కనిపించాడు. గాయం తీవ్రతపై ఎలాంటి అప్ డేట్ లేదు. మ్యాచ్ ను టర్న్ చేయగల పంత్ కు గాయం కావడంతో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది.
ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ బాధ్యతలను వెటరన్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మోస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి రాహుల్ వికెట్ కీపర్ గా కొనసాగుతాడని ఇప్పటికే కోచ్ గౌతమ్ గంభీర్ కన్ఫర్మ్ చేశాడు. ఇంగ్లాండ్ తో ఇటీవలే జరిగిన వన్డే సిరీస్ లోనూ వికెట్ కీపింగ్ బాధ్యతలను రాహుల్ చేపట్టాడు. వికెట్ కీపర్ గా.. రిజర్వ్ బ్యాటర్ గా పంత్ ఒక్కడే భారత జట్టులో ఉన్నాడు. జట్టులో ఎవరు గాయపడ్డా.. ఫామ్ లో లేకపోయినా పంత్ తప్ప మరో ఆప్షన్ లేదు. దీంతో పంత్ కోలుకోకపోతే భారత్ కు ఎదురు దెబ్బ తగిలినట్టే. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలక్ట్ చేసి తప్పించిన సంగతి తెలిసిందే.
Rishabh Pant got hit on his knees 👀
— Nikhil (@TheCric8Boy) February 16, 2025
- hope this is not serious 🙏 pic.twitter.com/Nz4e93Jf1b