కేన్స్‌‌లో ఫస్ట్‌‌ లుక్ లాంచ్ చేసే ప్లాన్లో రిషభ్ షెట్టీ

కేన్స్‌‌లో ఫస్ట్‌‌ లుక్ లాంచ్ చేసే ప్లాన్లో రిషభ్ షెట్టీ

ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చిత్రం బ్లాక్ బస్టర్‌‌‌‌ టాక్‌‌తో దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో శివాజీ జీవితం ఆధారంగా తెరకెక్కబోయే బాలీవుడ్ మూవీపై ఆసక్తి పెరుగుతోంది. రిషబ్ శెట్టి లీడ్ రోల్‌‌లో రూపొందనున్న ఈ చిత్రానికి సందీప్ సింగ్ దర్శకుడు. డిసెంబర్‌‌‌‌లోనే ఈ ప్రాజెక్ట్‌‌ను ప్రకటించిన మేకర్స్.. మంగళవారం ఈ సినిమాకు వర్క్ చేయబోతున్న టెక్నీషియన్స్‌‌ టీమ్‌‌ను రివీల్ చేశారు. 

పాపులర్ మ్యూజిక్ కంపోజర్‌‌‌‌ ప్రీతమ్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. స్క్రీన్‌‌ ప్లే రైటర్స్‌‌గా సిద్ధార్థ్‌‌, గరిమ, లిరిసిస్ట్‌‌గా ప్రసూన్ జోషి, డీవోపీగా రవి వర్మన్‌‌, సౌండ్ స్పెషలిస్ట్‌‌గా రసూల్ పూకుట్టి పేర్లను ప్రకటించారు. అలాగే ఎడిటింగ్, ఆర్ట్‌‌ డైరెక్టర్, యాక్షన్ కొరియోగ్రాఫర్, డ్యాన్స్ మాస్టర్స్‌‌, కాస్ట్యూమ్స్ సహా టీమ్ అందరినీ రివీల్ చేశారు. ఇక మే నెలలో జరుగనున్న కేన్స్‌‌ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

2027 జనవరి 21న సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ‘కాంతార 2’ షూటింగ్‌‌తో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి, ఆ తర్వాత ‘జై హనుమాన్‌‌’తో పాటు ఈ చిత్రం పూర్తి చేయాల్సి ఉంది.