ఆర్థిక సర్వే సంచలనం : లావు అయిపోతున్న భారతదేశం, ఒబేసిటీ సగటు 24 శాతం

ఆర్థిక సర్వే సంచలనం : లావు అయిపోతున్న భారతదేశం, ఒబేసిటీ సగటు 24 శాతం

భారతదేశంలో ఒబేసిటీ (స్థూలకాయం) భారీగా పెరిగినట్లు ఆర్థిక సర్వే 2024 వెల్లడించింది. 18 నుంచి 69 ఏళ్ల వయస్సు ఉన్న వారిపై సర్వే చేయగా.. గత ఏడాదితోపోల్చితే స్థూలకాయం (ఒబేసిటీ) ఎక్కువగా పెరిగినట్లు స్పష్టం అయ్యింది. రాష్ట్రాల వారీగా పురుషులు, మహిళల్లో ఎంత మంది ఒబేసిటీతో బాధపడుతున్నారో చూద్దాం..

>>>  నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5) ప్రకారం దేశంలో సగటున 22.9 శాతం మగాళ్లు స్థూలకాయంతో బాధపడుతున్నారు. గతంలో ఇది 18.9 శాతంగా ఉంటే.. ఈ ఏడాది ఏకంగా 4 శాతం పెరిగింది. 
>>>  మహిళల్లోనూ స్థూలకాయం సగటు 20.6 శాతంగా ఉండగా.. ఇప్పుడు 24 శాతానికి పెరిగింది. అంటే పురుషుల కంటే మహిళలే ఊబకాయంతో ఎక్కువ బాధపడుతున్నారు. 
>>>  స్థూలకాయంతో (ఒబేసిటీ) బాధపడుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. 
>>>  ఢిల్లీలో మహిళల్లో ఒబేసిటీ 41.3 శాతం, పురుషుల్లో 38 శాతం
>>>  తమిళనాడులో 37 శాతం పురుషులు, 40.4 శాతం మహిళల్లో స్థూలకాయంతో బాధపడుతున్నారు. 
>>>  ఆంధ్రప్రదేశ్‌లో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 36.3 శాతం, పురుషులు 31.1 శాతం
>>>  తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 30.1 శాతం, పురుషులు 32.3 శాతం
>>>  పట్టణ ప్రాంతాల్లో స్థూలకాయం పెరిగినట్టు సర్వేలో గుర్తింపు
>>>  నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5) నిర్వహించిన సర్వేలో.. కోవిడ్ మహమ్మారి, లాక్ డౌన్ తర్వాత దేశంలో ఒబేసిటీ గణనీయంగా పెరిగినట్టు గుర్తింపు

అటు మహిళలు, ఇటు పురుషు కలిపి తీసుకున్నా.. సగటున 24 శాతం మంది దేశంలో స్థూలకాయం.. ఒబేసిటీతో బాధపడుతున్నట్లు సర్వే స్పష్టం చేస్తుంది. 

ALSO READ | 

మరిన్ని వార్తలు