భద్రాచలం,వెలుగు: పుష్యమి నక్షత్రం వేళ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఉదయం గర్భగుడిలో సుప్రభాత సేవ చేసిన అనంతరం మూలవరులు, ఉత్సవమూర్తులు, లక్ష్మీతాయారు అమ్మవారికి, ఆంజనేయస్వామికి ముత్యాలు పొదిగిన వస్త్రాలు అలంకరించి ముత్తంగి సేవ చేశారు.
Also Read : గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంలో టపాసులు కాల్చటంపై నిషేధం
అనంతరం బేడా మండపంలో సీతారాములకు నిత్య కల్యాణం చేశారు. భక్తరామదాసు చేయించిన నగలను అలంకరించి నదీ జలాలతో ప్రోక్షణ చేశారు. రాజదండం, రాజముద్రిక అనంతరం కిరీటం అలంకరించి పట్టాభిషిక్తుడిని చేశారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. చిత్రకూట మండపంలో భాగవతసప్తాహం ముగింపు సందర్భంగా పూర్ణాహుతి చేశారు. కల్యాణం నిర్వహించారు.