బీఈ, బీటెక్ అర్హతతో మేనేజర్ జాబ్స్.. ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు..

బీఈ, బీటెక్ అర్హతతో మేనేజర్ జాబ్స్.. ఇంటర్వ్యూ అటెండ్ అయితే చాలు..
  • ఆర్ఐటీఈఎస్​లో మేనేజర్​ పోస్టులు

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్​ పోస్టుల భర్తీకి గుడ్​గావ్​లోని ఇండియా టెక్నికల్ అండ్​ ఎకనామిక్​ సర్వీస్​ లిమిటెడ్(ఆర్ఐటీఈఎస్) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 17వ తేదీలోగా అప్లై చేసుకోవచ్చు. 

  • పోస్టుల సంఖ్య 06: సివిల్, మెకానికల్, ఫైనాన్స్ విభాగాల్లో గ్రూప్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్ఆర్ )  పోస్టులను భర్తీ చేయనున్నారు. 
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్​లో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి గ్రూప్ మేనేజర్ పోస్టుకు 53 ఏండ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్​ పోస్టుకు 41 ఏండ్లు ఉండాలి. 
  • అప్లికేషన్: ఆన్ లైన్​ ( https://recruit.rites.com/frmRegistration.aspx )
  • సెలెక్షన్​ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.