Horror Comedy OTT: ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న హారర్ కామెడీ మూవీ..మూడు రోజుల్లోనే రికార్డు వ్యూస్ సొంతం

కొన్ని చిత్రాలు కామెడీతో నవ్విస్తాయి..కొన్ని ఎమోషన్స్ తో బాధిస్తాయి..కొన్ని ఆలోచింపజేస్తాయి..మరికొన్ని హార్రర్ తో భయపట్టేస్తాయి.ఈ మూవీ మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తూనే భయపెట్టేస్తుంది. అయితే, ఇదంతా ఎందుకనుకుంటున్నారా? ప్రస్తుతం జీ5 ఓటీటీలో కాకుడా అనే హారర్ కామెడీ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 

మరాఠీ డైరెక్టర్ ఆదిత్య సర్పోదర్ డైరెక్ట్ చేసిన కాకుడ జులై 12న ఓటీటీలోకి రాగా..రిలీజైన మూడు రోజుల్లోనే 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. తాజాగా జీ5 ఓటీటీ..'చిల్లింగ్ వీకెండ్లో..చిల్లింగ్ టేకోవర్' అంటూ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీలో జెనీలియా భర్త రితేష్ దేశ్‌ముఖ్,ఆసిఫ్ ఖాన్, సోనాక్షి సిన్హా, సాకిబ్ సలీమ్ ప్రధాన పాత్రలలో నటించిన కాకుడ ఆడియన్స్ను వీపరీతంగా ఆకట్టుకుంటోంది.అటు వెన్నులో వణుకు పుట్టిస్తూనే మరోవైపు కడుపుబ్బా నవ్విస్తున్న ఈ ఫిలిం స్టోరీ ప్లాట్ విభిన్నంగా ఉంటుంది. 

Also Read:-బ్రేకింగ్..లావణ్య ఫిర్యాదు..రాజ్ తరుణ్కు నోటీసులు పంపిన నార్సింగ్ పోలీసులు

కాకుడ స్టోరీ

రాజస్థాన్ రాష్ట్రంలోని రథోడీ అనే గ్రామం శాపగ్రస్తమైంది. ఆ ఊళ్లోకి ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు కాకుడా అనే దెయ్యం వస్తుంది. ఆ ఊళ్లో ప్రతి మంగళవారం రాత్రి 7.15 గంటలకు ప్రతి ఇంటికి ఉండే ఓ చిన్న తలుపును తెరిచి ఉంచాల్సిందే. ఎందుకంటే, కాకుడ అనే దెయ్యం తప్పకుండ ఆ రోజు ఊళ్లోకి వస్తుంది.ఇక అదే టైంకి తలుపు తెరవని వారిని 13 రోజుల టైమ్ ఇచ్చి మరీ ఆ ఆ ఇంటి మనిషిని దెయ్యం చంపుతుంది. అయితే ఆ చిన్న డోరును తెరిచి ఉంచకపోవడంతో సోనాక్షి భర్త ఆ దెయ్యానికి దొరికిపోతాడు. ఇక రోజు ఆ దెయ్యం వస్తుందని..చంపేస్తుందని భయపడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో ఓ ఘోస్ట్ హంటర్ విక్టర్ (రితేష్ దేశ్‌ముఖ్) ఆ ఊళ్లోకి వస్తాడు. దెయ్యాలేమీ లేవని, అదంతా ఉత్త మూఢనమ్మకమంటూను ధైర్యం చెప్తూ ఆ దెయ్యం అంతు చూడాలని డిసైడ్ అవుతాడు. చివరికి వారిద్దరూ కలిసి ఆ కాకుదాను పట్టుకుంటారా? ఆ ఊళ్లో వాళ్లను కాపాడతారా అన్నదే సినిమా స్టోరీ.