
బెట్టింగ్ యాప్స్ కేసులో స్టేషన్ కు హాజరైన విష్ణు ప్రియ, రీతూ చౌదరిని పోలీసుల విచారణ ముగిసింది. గురువారం (మార్చి 20) పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విష్ణు ప్రియను దాదాపు 10 గంటల పాటు విచారించారు. అదేవిధంగా ఇదే కేసులో రీతూ చౌదరిని సుమారు 6 గంటల పాటు విచారించారు. తదుపరి విచారణకు ఈ నెల (మార్చి) 25న ఇద్దరూ హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు.
విచారణలో భాగంగా స్టేషన్ కు వచ్చిన వెంటనే ఈ ఇద్దరి ఫోన్ లను సీజ్ చేసి విచారణ మొదలు పెట్టారు పోలీసులు. పోలీసుల విచారణకు రీతూచౌదరి సహకరించలేదని సమాచారం. పోలీసులు అడిగిన ప్రశ్నలకు రీతూ చౌదరి కొన్ని సార్లు సరైన సమాధానం చెప్పలేదు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ గురించి తనకు తెలియదని, విష్ణు ప్రియ చెప్పడం వల్లే చేశానని పోలీసులకు చెప్పింది. ప్రమోషన్ ఎలా చేయాలో కూడా విష్ణు ప్రియనే తనకు తనకు నేర్పించిందని తెలిపింది. విచారణలో తను అమాయకురాలినని, తనకేం తెలియదని అంతా విష్ణుప్రియే కారణం అని ఆమెపైకి తోసింది రీతూ చౌదరి.
Also Read : అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే రానా ఆ యాప్స్ ప్రమోట్ చేశాడు
అయితే ఈ కేసులో విచారణ పూర్తి చేశారు పోలీసులు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా విచారించారు. విష్ణు ప్రియ, రీతూ చౌదరి చెప్పిన సమాధానాలను, వారి స్టేట్ మెంట్స్ ను రికార్డు చేసుకున్నారు పోలీసులు. ఈ నెల 25న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.