
హుజూర్ నగర్, వెలుగు: రైతులకు మిర్చి క్వింటాల్‌కు రూ. 25 వేలు మద్దతు ధర ఇవ్వాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు అన్నారు. శనివారం హుజూర్ నగర్ లో మిర్చి రైతులకు మద్దతు ధర చెల్లించాలని ఆర్డీవో శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిర్చి సాగుకు ఖర్చులు పెరిగినందున తగిన మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు మామిడి నరసయ్య, జక్కుల రమేశ్, జడ వెంకన్న, యల్లావుల రమేశ్, కుడి తొట్టి స్వామి, బంటు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.