
న్యూఢిల్లీ: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరి చిలీ ఓపెన్ ఏటీపీ 250 టోర్నమెంట్‌లో మెన్స్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. కొలంబియాకు చెందిన నికోలస్ బారియంటోస్‌తో కలిసి బరిలోకి దిగిన రిత్విక్ శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో 6–3, 6–2 తేడాతో టాప్ సీడ్స్ మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మొల్టెని (అర్జెంటీనా)కు షాకిచ్చాడు. తొలి గేమ్ నుంచే సత్తా చాటిన రిత్విక్–నికోలస్ 11 ఏస్‌లతో అదరగొట్టారు. ప్రత్యర్థి జోడీ కేవలం ఒకే ఏస్ కొట్టగలిగింది.