Rituraj Singh: ప్రముఖ నటుడు రీతురాజ్ సింగ్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ టీవీ యాక్టర్ రీతురాజ్ సింగ్(Rituraj Singh) కన్నుమూశారు. కొంతకాలంగా ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం(ఫిబ్రవరి 19) రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. 59 ఏళ్ళ రీతురాజ్ సింగ్ మరణవార్తతో బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇక రాజస్తాన్ కు చెందిన రీతూ రాజ్.. ఢిల్లీలో చదువుకుని అమెరికా వెళ్లిపోయారు. అనంతరం ఇండియాకు తిరిగివచ్చిన రీతూ రాజ్ కుటుంబం ముంబయిలో సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తి ఉన్న రీతూ రాజ్..  టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్ తోపాటు సినిమాల్లో కేసుల నటించాడు. జ్యోతీ, హిట్లర్ దీదీ, బనేగీ అప్నీ బాత్, షపత్, అదాలత్, సీఐడీ వంటి సీరియన్స్ లో సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.