IND vs BAN: ఇలా కూడా బౌలింగ్ చేస్తారా: అత్యుత్సాహంతో పరువు పోగొట్టుకున్న పరాగ్

IND vs BAN: ఇలా కూడా బౌలింగ్ చేస్తారా: అత్యుత్సాహంతో పరువు పోగొట్టుకున్న పరాగ్

టీమిండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్ విచిత్రమైన బౌలింగ్ యాక్షన్ తో మూల్యం చెల్లించుకున్నాడు. ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్ పై జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో అంపైర్ కు దూరంగా జరిగి బంతిని విసిరాడు. తన చేతిని పూర్తిగా తిప్పకుండా బంతిని అమాంతం విసిరేశాడు. అయితే ఈ బంతిని థర్డ్ అంపైర్ నో బాల్ గా ప్రకటించడంతో ఒక్కసారిగా షాకయ్యాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 11 ఓవర్లో ఈ సంఘటన జరిగింది. 

వింత యాక్షన్ తో బౌలింగ్ చేయడం పరాగ్ ఇది తొలిసారి కాదు. గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున అతను వైవిధ్యమైన బౌలింగ్ తో బ్యాటర్ ను కన్ఫ్యూజ్ చేసేవాడు. పరాగ్ బౌలింగ్ కు నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది సెటైర్ వేస్తుంటే.. మరికొందరు ఇదంతా పరాగ్ కు సాధారణ విషయమే అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ మ్యాచ్ లో పరాగ్ ఆల్ రౌండ్ షో తో అదరగొట్టాడు. బ్యాటింగ్ లో 2 సిక్సర్లతో ఆరు బంతుల్లోనే 15 పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ మెహదీ హసన్ వికెట్ పడగొట్టాడు.      

Also Read : ముంబైకి కలిసొచ్చిన ఆక్షన్ రూల్        

ఈ మ్యాచ్ లో తెలుగు బ్యాటర్‌‌ నితీశ్‌‌ కుమార్‌‌ (34 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 74), రింకూ సింగ్‌‌ (29 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 53) దుమ్మురేపడంతో.. బంగ్లాదేశ్‌‌తో జరిగిన రెండో టీ20లోనూ ఇండియా 86 రన్స్‌‌ తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. స్వదేశంలో ఇండియాకు ఇది వరుసగా 16వ సిరీస్‌‌ విజయం కావడం విశేషం. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో.. టాస్‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 221/9 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.