CSK vs RR: రెండు గంటల పాటు చెన్నై ఇన్నింగ్స్.. పరాగ్‌కు భారీ జరిమానా!

CSK vs RR: రెండు గంటల పాటు చెన్నై ఇన్నింగ్స్.. పరాగ్‌కు భారీ జరిమానా!

ఐపీఎల్ లో వరుసగా రెండో సారి స్లో ఓవర్ రేట్ నమోదయింది. ముంబైగా ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్లో ఓవర్ రేట్ కు గురయ్యాడు. గౌహతి వేదికగా వేదికగా ఆదివారం (మార్చి 30) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పరాగ్ కు రూ.12 లక్షల రూపాయల ఫైన్ వేశారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న రెండో కెప్టెన్ గా నిలిచాడు. ఛేజింగ్ చేస్తున్నప్పుడు చెన్నై సూపర్ ఇన్నింగ్స్ రెండు గంటల పాటు సాగింది. 

ఫీల్డింగ్ లో మార్పులు చేయడానికి పరాగ్ ఎక్కువగా సమయం తీసుకున్నాడు. దీంతో 90 నిమిషాల్లో ముగియాల్సిన ఇన్నింగ్స్ 120 నిమిషాలు పట్టింది. ఈ సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్లకు జరిమానా విధించబడదు. అయితే కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు. ఇవి మూడు సంవత్సరాల పాటు కొనసాగుతాయి. ఈ నిషేధం తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో 37 పరుగులు చేసి బ్యాటింగ్ లో రాణించిన పరాగ్.. ఫీల్డింగ్ లోనూ కళ్ళు చెదిరే క్యాచ్ అందుకొని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 

Also Read :- ముంబైతో మ్యాచ్‌కు సునీల్ నరైన్.. మ్యాచ్ విన్నింగ్ ఆల్ రౌండర్‌పై వేటు!

ఐపీఎల్ లో పరాగ్ కెప్టెన్ గా తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం (మార్చి 30) గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. సంజు శాంసన్ స్థానంలో కెప్టెన్సీ చేస్తున్న అతను తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమి తర్వాత ఎట్టకేలకు విజయాన్ని అందుకున్నాడు.ప్రస్తుతం రాజస్థాన్ స్టాండింగ్ కెప్టెన్ గా ఉంటున్న పరాగ్.. తన తదుపరి మ్యాచ్ లో ఈ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. శనివారం (ఏప్రిల్ 5) పంజాబ్ కింగ్స్ తో జరగబోయే మ్యాచ్ కు సంజు శాంసన్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.