CSK vs RR: ఈ ఆటిట్యూడ్ అవసరమా: రాజస్థాన్ కెప్టెన్ ఓవరాక్షన్..సెల్ఫీ ఇచ్చి ఫోన్ పడేశాడు

CSK vs RR: ఈ ఆటిట్యూడ్ అవసరమా: రాజస్థాన్ కెప్టెన్ ఓవరాక్షన్..సెల్ఫీ ఇచ్చి ఫోన్ పడేశాడు

రాజస్థాన్ రాయల్స్ స్టాండింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. సంజు శాంసన్ స్థానంలో కెప్టెన్సీ చేస్తున్న అతను తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమి తర్వాత ఎట్టకేలకు విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం (మార్చి 30) గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. దీంతో పరాగ్ కెప్టెన్ గా తొలి విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో 37 పరుగులు చేసి బ్యాటింగ్ లో రాణించిన పరాగ్.. ఫీల్డింగ్ లోనూ కళ్ళు చెదిరే క్యాచ్ అందుకొని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. 

ALSO READ | MS Dhoni: ధోనీ 10 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయలేడు.. అందుకే 9వ స్థానంలో బ్యాటింగ్: ఫ్లెమింగ్

మ్యాచ్ తర్వాత సంతోషంలో తేలిపోయిన ఈ రాజస్థాన్ కెప్టెన్ ఒక విషయంలో మాత్రం సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం తర్వాత గ్రౌండ్ స్టాఫ్ పరాగ్ తో సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. పరాగ్ వారికి సెల్ఫీ ఇచ్చి.. ఫోన్ చేతికివ్వకుండా విసిరేశాడు. అతను చేసిన ఈ పనికి  సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఒక అభిమాని ధోనీపై మ్యాచ్ గెలిచేసరికీ పరాగ్ దేవుడిలా ఫీలవుతున్నాడు. అని కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ "పరాగ్ తన ఆటిట్యూడ్ తో భవిష్యత్తులో తన కెరీర్ ను నాశనం చేసుకుంటాడు" అని ట్వీట్ చేశాడు.  

వరుసగా రెండు పరాజయాల తర్వాత ఐపీఎల్‌‌‌‌‌‌‌‌–18లో రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ రాయల్స్ గెలుపు బాట పట్టింది. నితీష్‌‌‌‌‌‌‌‌ రాణా (36 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81) మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు తోడు వానిందు హసరంగ (4/35) స్పిన్ మాజిక్‌‌‌‌‌‌‌‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  రాయల్స్ 6 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించి లీగ్‌‌‌‌‌‌‌‌లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠ పోరులో తొలుత రాజస్తాన్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో  182/9 స్కోరు చేసింది. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సీఎస్కే 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసి ఓడింది.