ఆయుధాల కేసులో పరారీలో ఉన్న రిజ్వాన్​ అరెస్ట్

ఆయుధాల కేసులో పరారీలో ఉన్న రిజ్వాన్​ అరెస్ట్
  •     సౌదీ వెళ్లొచ్చి పోలీసులకు చిక్కిన నిందితుడు

నిజామాబాద్, వెలుగు : రివాల్వర్, కత్తులు, తల్వార్లతో పట్టుబడిన కేసులో రెండు నెలల నుంచి పరారీలో ఉన్న రిజ్వాన్​ పోలీసులకు చిక్కాడు. సౌదీ వెళ్లి సిటీకి తిరిగొచ్చిన అతడిని గురువారం అర్ధరాత్రి పెట్రోలింగ్​ పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.  నవంబర్ 7న టాస్క్​ఫోర్స్​ పోలీసులు నిజాం కాలనీలోని ఒక రైస్ మిల్​పై రైడ్​ చేసి సుమారు 70 క్వింటాళ్ల పీడీఎస్​రైస్​తో పాటు ఒక చోట పిస్టల్, తల్వార్లు

కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ ​రైస్​ దందా నడపడానికి  మీర్జా అంజాద్ బేగ్, రిజ్వాన్​ ఆయుధాలు వాడుతున్నట్లు విచారణలో  తేలింది. మీర్జా అంజాద్​బేగ్​ను అప్పుడే అరెస్ట్​ చేయగా అతడి బిజినెస్​ పార్టనర్​ రిజ్వాన్​ సౌదీ పరారీలో ఉన్నాడు. ఘటన తర్వాత రిజ్వాన్​ పరారై సౌదీకి వెళ్లాడు. సౌదీ నుంచి తిరిగొచ్చి అనూహ్య రీతిలో అర్ధరాత్రి పెట్రోలింగ్​పోలీసులకు చిక్కాడు. సిక్స్త్​ టౌన్​ ఎస్ఐ సందీప్​ కేసును విచారిస్తున్నారు.