వడ్ల కొనుగోలు, తరలింపు స్పీడప్ ​చేయాలి

వడ్ల కొనుగోలు, తరలింపు స్పీడప్ ​చేయాలి

ములుగు/ మహబూబాబాద్/ జనగామ అర్బన్/ ఎల్కతుర్తి/ వర్ధన్నపేట, వెలుగు: వడ్ల కొనుగోళ్లు, తరలింపును స్పీడప్​చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, రిహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, మహబూబాబాద్, జనగామ​కలెక్టర్లు అద్వైత్​కుమార్​సింగ్, రిజ్వాన్​బాషా షేక్​అన్నారు. ​మంగళవారం వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలుపై కృష్ణారెడ్డి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి పీఏసీఎస్ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్​కలెక్టర్ మహేందర్ జీతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం కలెక్టరేట్ లో కలెక్టర్ దివాకరతో సమావేశమై ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అన్లోడ్ సమస్యలు, హమాలీలు, లారీల సమస్యల పై మాట్లాడారు. వరంగల్​జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. మహబూబాబాద్​జిల్లా మరిపెడ మండలం చిల్లంచెర్ల, రాంపూర్, దంతాలపల్లి, పెద్దముప్పారం, పెద్ద వంగరలో కలెక్టర్​డీఆర్డీవో మధుసూదన్ రాజు, డీసీవో వెంకటేశ్వర్లు, డీఎస్వో ప్రేమ్ కుమార్ తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పెద్ద వంగర అంగన్ వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 226 కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని, కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నారు. జనగామ కలెక్టరేల్​లో ఐకేపీ, పీఏసీఎస్​నిర్వాహకులు, అధికారులతో కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్​ అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్​, ఆర్డీవోలు, డీఎస్, ఇతర అధికారులతో కలిసి జూమ్​మీటింగ్​నిర్వహించారు. కొనుగోలు సెంటర్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ఓపీఎంఎస్​ ఎంట్రీ చేయడంలో అవగాహన కల్పించాలని సూచించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మార్కెట్​యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్​కలెక్టర్​వెంకట్​రెడ్డి  డీఆర్డీవో నాగపద్మజ, డీఎస్వో కొమురయ్య, డీబీఎం ప్రకాశ్ కలిసి సందర్శించారు. జిల్లాలో 154 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.