
హైదరాబాద్, వెలుగు: సింగపూర్ యూత్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఇండియా టీమ్‌కు హైదరాబాద్‌సెయిలర్లు మొహమ్మద్ రిజ్వాన్, కొమరవెల్లి లాహిరి, దండు వినోద్ ఎంపికయ్యారు. శుక్రవారం మొదలయ్యే ఈ టోర్నీలో 25 దేశాల నుంచి 200 మంది బరిలోకి దిగనున్నారు. రిజ్వాన్, లాహిరి గోల్డ్ ఫ్లీట్ అండర్-15 ఆప్టిమిస్ట్ క్లాస్ బోట్స్ విభాగంలో పోటీపడతారు. మొత్తం 8 మందితో కూడిన ఇండియా టీమ్‌కు హైదరాబాదీలు ధరణి లావేటి మేనేజర్‌గా, సుహీమ్ షేక్ కోచ్‌గా వ్యవహరిస్తారు.