
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయిన పేరు క్రికెటర్ యజువేంద్ర చాహల్. భార్య ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత పర్సనల్ లైఫ్ గురించి రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇన్ స్టా గ్రామ్ సెలెబ్రిటీ ఆర్జే మహ్వాశ్ తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా కనిపించడంతో వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారనే చర్చ నడిచింది. అయితే ఈ ర్యూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది మహ్వాశ్. తమ రిలేషన్ షిప్ గురించి క్లియర్ గా చెప్పేసింది.
రీసెంట్ గా ఒక పాడ్ కాస్ట్ లో చాహల్ తో డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మడు. కాజువల్ డేటింగ్ పై కూడా తనకు ఎలాంటి నమ్మకం లేదని చెప్పేసింది. ‘‘నేను సింగిల్ గా ఉండటానికే ఇష్టపడతా. ఈ రోజుల్లో పెళ్లి అనే కాన్సెప్ట్ తనకు అర్థం కాని విషయం’’అని చెప్పింది. మాడ్రన్ డేస్ రిలేషన్ షిప్స్ గురించి పాడ్ కాస్ట్ లో చెబుతూ ఈ కామెంట్స్ చేసింది.
‘‘నేను ఎవరినైతే పెళ్లి చేసుకుంటానో వాళ్లతోనే డేట్ కి వెళ్తా. క్యాజువల్ డేటింగ్ కు వెళ్లడం ఇష్టం ఉండదు. ధూమ్ సినిమాలో లాగా బైక్ పై ఫ్యామిలీ, పిల్లలు ఉండాలనుకునే దాన్ని’’ అని చెప్పింది.
అయితే తను 19 ఏళ్ల వయసులోనే ఒకరితో ఎంగేజ్ అయ్యి రెండేళ్లకు అంటే 21 ఏళ్ల వయసులో బ్రేకప్ చెప్పానని తెలిపింది. అలీగఢ్ లాంటి నగరాల్లో నివసించే వారికి ఉండే ఏకైక ఆప్షన్, కండిషన్ మంచి భర్త దొరకటమేనని ఈ సందర్బంగా తెలిపింది.
అయితే పెళ్లి చేసుకోబోయే వాళ్లతోనే డేటింగ్ చేస్తా అని మహ్వాశ్ చేసిన కామెంట్స్ పై చాహల్ ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నారు. పెళ్లి చేసుకునేవాళ్లతోనే డేటింగ్ అంటుందంటే.. చాహల్ ను పెళ్లి చేసుకుంటుందని కన్ఫమ్ గా చెప్పేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది మహ్వాశ్. చాహల్ కోసం మ్యాచ్ కు వెళ్లడం నుంచి ఈ ర్యూమర్స్ అయితే ఆగడం లేదు. దీనికి చాహల్ నుంచే సరైన సమధానం రావాలి.